36 C
India
Monday, April 29, 2024
More

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Date:

    Train Accident
    Train Accident

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్ వర్క్. నార్త్ సెంట్రల్ టూ సౌత్ సెంట్రల్ వరకు దేశ వ్యాప్తంగా అతిపెద్ద వ్యవస్థ. దీనితో పాటు అత్యంత ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నది కూడా రైల్వేలోనే. ఇంత మంది ఎంప్లాయీస్ ఉన్నా.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. బాలాసోర్ ఘటన జరిగి వందలాది మంది మరణించినా ఇప్పటికీ ఆ ఘటన నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో రైల్ యాక్సిడెంట్ జరిగింది.

    చైనా, జపాన్ లాంటి దేశాలు గంటకు 300 కిలో మీటర్లకు పైగా వేగంతో వెళ్లే రైళ్లను నడుపుతుంటే.. భారత్ లో వేగం  గంటకు 100 కిలో మీటర్లే లోపే. ఈ మధ్య వచ్చిన ‘వందే భారత్’ లాంటి రైళ్లు గంటకు గరిష్టంగా 95 కిలో మీటర్ల వరకు దూసుకెళ్లగలవు. దీనికే మనం బుజాలు తడుముకుంటున్నాం. భారత రైల్వే అది సాధించింది.. ఇది సాధించింది.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా.. వరుస ప్రమాదాలు మాత్రం ప్రయాణికుల భద్రతను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఐదు నెలలకు ముందు ఒడిషాలోని బాలేశ్వర్ లో భయంకర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 270కి పైగా మంది మరణించారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి రైల్వే శాఖ ఏమి నేర్చుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

    జూన్‌, 2023లో ఒడిషాలోని బాలాసోర్ జిల్లా, బహనాగా స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటలకు భారీ రైలు ప్రమాదం సంభవించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాద దాటికి కోరమాండల్ రైలులోని బోగీలు పట్టాలపై చల్లాచెదురుగా పడిపోయాయి. ఇదే సమయానికి ఎదురుగా వస్తున్న యశ్వంత్ పూర్-హౌరా సూపర్ ఫాస్ట్ ఢీ కొట్టింది. కోరమాండల్, గూడ్స్, యశ్వంత్ పుర మూడు రైళ్లు ప్రమాదాలకు గురవడంతో 275 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదం విషయంలో చాలా అనుమానాలు వచ్చినా.. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం అంటూ ప్రాథమికంగా తేల్చారు.

    అదే తరహాలోనే..
    కోరమాండల్ ఘటన మాదిరిగానే ఆదివారం (అక్టోబర్ 29) రాత్రి విశాఖ-పలాస వెళ్తున్న స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్ (08532) సిగ్నల్ ఇవ్వకపోవడంతో కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ఆగి ఉంది. ఇదే సమయంలో విశాఖ-రాయగడ (08504) వెళ్తున్న ప్యాసింజర్ ఆగి ఉన్న స్పెషల్ ప్యాసింజర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటన రాత్రి 7 సమయంలో జరిగింది. ఇందులో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది.

    కంటకాపల్లి వద్ద సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే వాటికి మరమ్మతు చేస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు. సిగ్నల్ ఇవ్వకపోవడంతో స్పెషల్ ప్యాసింజర్ కంటకాపల్లి దాటాక నిలిపి ఉంచారు. అయితే దాని వెనుక వస్తున్న విశాఖ రాయగడ ప్యాసింజర్ కంటకాపల్లి వద్ద నిలపాల్సి ఉంది. కానీ సిగ్నలింగ్ వ్యవస్తలో లోపంతో ముందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందనే అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం పై రైల్వే శాఖ ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు.

    బాలసోర్, కంటకాపల్లి రెండు ప్రమాదాలు ఒకేలా కనిపిస్తున్నాయి. మరి బాలాసోర్ యాక్సిడెంట్ నుంచి రైల్వే శాఖ ఏం నేర్చుకున్నట్లు? అంటూ ప్రశ్నలు వినిపిస్తు్న్నాయి. వందే భారత్ స్పీడ్ 95కు పైగా పెరిగింది. ‘నమో భారత్’ ట్రైన్ స్పీడ్ ఇంకా పెరగనుంది. ఇవి సరే.. కానీ ప్రయాణికుల భద్రతకు ఏ హామీ ఇస్తారు? అంటూ వాదనలు విపిస్తు్న్నాయి. ప్రపంచంలోనే అత్యంత గొప్ప సిగ్నలింగ్ వ్యవస్థ ‘కవచ్’ అంటూ చెప్పుకునే శాఖను ప్రమాదాలు జరుగుతుండడంతో కవచ్ సేఫేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Railway Huge Success : రైల్వే భారీ విజయం.. గంగా నది కింది నుంచి..(వీడియో)

    Railway Huge Success : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి (2014)...

    AP Train Accident 2023 : ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

    AP Train Accident 2023 : ఏపీలోని విజయగరం జిల్లా కొత్తవలస...

    Andhra Train Accident 2023 : విజయనగరంలో మృత్యుఘోష.. రైలు పట్టాలపై మరణ మృదంగం

    Andhra Train Accident 2023 : విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం...