Bigg boss ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 కోసం వేదిక సిద్ధం అవుతుంది. అతి త్వరలోనే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రోమో రిలీజ్ చేసి తెలిపారు. ఈసారైనా సీజన్ సూపర్ హిట్ అవ్వాలని మేకర్స్ కోరుకుంటున్నారు. 6వ సీజన్ అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 7వ సీజన్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్..
ఎట్టకేలకు బిగ్ బాస్ లవర్స్ ఎన్నో రోజులుగా ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ 7 అతి త్వరలోనే స్టార్ట్ అంటూ ప్రోమో రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సీజన్ గురించి అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.. బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ తో పాటు గత 6 సీజన్స్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఒకే వేసికపైకి రాబోతున్నారట.
వీరందరూ కలిసి బేబీ షైనింగ్ స్టార్స్ ఈవెంట్ లో ఆటపాటలతో సందడి చేయబోతున్నారు.. కొత్త తరహా వినోదాలను పంచేందుకు బిగ్ బాస్ 7 తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది .. ఈసారి కూడా ఈ సీజన్ ను నాగార్జున హోస్ట్ గా చేయనున్నాడు. గత సీజన్ కు భిన్నంగా ఈ సీజన్ ను మరింత వినోదభరితంగా ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధం అయ్యింది.
గత సీజన్ లా తప్పులు జరగకుండా స్టార్ మా చర్యలు చేపట్టింది. సీజన్ 7 పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు షైనింగ్ స్టార్స్ పేరుతో ఒక స్పెషల్ షోను స్టార్ మా ఛానెల్ డిజైన్ చేసింది. గత 6 సీజన్స్ లోని కంటెస్టెంట్స్ అందరు ఈ బిగ్ బాస్ షైనింగ్ స్టార్స్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.. వీరంతా బిగ్ బాస్ జర్నీ గురించి తమ అనుభవాలను పంచుకోనున్నారు. తాజాగా ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది నెట్టింట వైరల్ అయ్యింది.