36.7 C
India
Thursday, May 16, 2024
More

    Nagarjuna Sagar’s father Muktyala :నాగార్జున సాగర్ పితామహుడు ముక్త్యాల రాజు చరిత్ర మీకు తెలుసా..

    Date:

     

    నాగార్జునసాగర్ అంటేనే మనకు మెట్టమెదట గుర్తుకు వచ్చేది ముక్త్యాల రాజు అలియాస్ వాసిరెడ్డి రామగోపాలకృష్ణా మహేశ్వర ప్రసాద్ మనకు గుర్తుకు వస్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మహానుభావుడని చేప్పుకోవచ్చు. నేడు ఆయన 50వ వర్ధంతి ఈ సందర్బంగా ఆయన గురించి జైస్వరాజ్య న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం..

     

    ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్రదేశంలో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశానికి చెందినవాడు. ఇతడి ని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ కు తలమానికమగు నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. తొలుత ఇతను కృష్ణా  నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి కృషిచేసాడు. ఈ ప్రాజెక్టు పూర్తికాబడి ఉపయోగంలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు సన్నాహాలు చేయుట మొదలుపెట్టింది.

    తొలుత కృష్ణా పెన్నా నదులను సంధించుటకు తలపెట్టింది దీంతో మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. మాచర్ల నుండి దట్టమయిన అడవులగుండా నందికొండ వరకు వెళ్ళి డాం నకు అనువైన స్థలం చూశాడు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచే ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించాడు. మద్రాసు ప్రభుత్వం వారి ప్రయత్నాలకు అన్నివిధము లా అడ్డు పడినా కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ కమిటీ సభ్యులు నందికొం డకు కార్లు జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయంను దాటవేయుటకు ప్రయత్నించారు.

     

    దీని వెనుక ఎవరున్నారో రాజాగారికి అర్ధమయింది. వారు వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి కార్లు వెళ్ళుటకు వీలగు దారి ఏర్పాటుచేయించాడు. ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చారు.ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నాలు మొదలైనవి.మహేశ్వర ప్రసాద్ ఢిల్లే వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు.

    అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశాడు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నిర్మాణ సమయంలో మహేశ్వర ప్రసాద్ యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చాడు. 1966 ఆగస్టు 3న డాం నుండి నీరు వదిలారు.నాగార్జునసాగర్ డాం ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యంగా సాగర్ ఆయకట్టు రైతులకు మహేశ్వర ప్రసాద్ బహుధా స్మరణీయులు.కాని రాజావారి సేవలను తర్వాతి తరం వారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గుర్తించలేదు, సరిగదా పూర్తిగా మరచారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India Team : స్వదేశంలో మొదటి సారి ఓడిన భారత్.. చరిత్ర లో చెత్త రికార్డ్ మూట కట్టుకున్న భారత్..?

    చరిత్రలో తొలిసారి భరత్ చెత్త రికార్డు సొంతం చేసు కుంది. ఉప్పల్...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Crime : ఒక ప్రాణం కోసం.. ఐదు ప్రాణాల పోరాటం..

    Crime : కన్న కూతురి వైద్యం కోసం వెదురు కర్రలే ఊతంగా ఉప్పొంగుతున్న...

    BCCI new chief : బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్..లవ్ స్టోరీ 1999 మీకు తెలుసా-

    BCCI new chief :  ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న...