33.2 C
India
Sunday, May 19, 2024
More

    Twitter scared : ట్విట్టర్ ను నిజంగా మోడీ ప్రభుత్వం భయపెట్టిందా? నిజమెంత?

    Date:

    Twitter scared
    Twitter scared

    Twitter scared : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ ప్రభుత్వంపై వివిధ ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాని మోడీ హయాంలో బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందిని వార్తలువినిపిస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో ట్విటర్ మాజీ సీఈవో చేసిన ఆరోపణలు యావత్ దేశాన్ని కుదిపేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలను ప్రతిపక్షం అందిపుచ్చుకుంటోంది. దీన్ని కూడా అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. చాలా వరకు బిల్లులను తెచ్చింది. బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో కొన్ని ఆర్డినెన్స్ ల రూపంలో కూడా తెచ్చింది. ఇందులో వచ్చిందే వ్యవసాయ బిల్లు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ బిల్లు ప్రకారం రైతులు తాము పండించిన పంటను ఏక్కడైనా.. ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవచ్చు అని ఉంది. ఈ బిల్లును దీన్ని కొందరు మేథావులు మెచ్చుకోగా.. మరికొంందరు వ్యతిరేకించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ తో పాటు కొన్ని చోట్ల తీవ్రంగా నిరసనలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు శాశ్వత నిరసన కోసం రైతులు నిరసన గదులను కూడా నిర్మించుకున్నారు. దీంతో దేశం యావత్తు ఈ బిల్లుపై రగిలిపోయింది.

    రైతులు చేపడుతున్న నిరసనల నేపథ్యంలో ఎలాగైనా కట్టడి చేయాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంది. దీన్ని సోషల్ మీడియా నుంచి మొదలుపెట్టాలి అనుకుంది. ఆ సమయంలో ట్విటర్ కు బాగా క్రేజ్ ఉంది. అప్పుడు ఆ కంపెనీకి సీఈవోగా జాక్ డోర్సే వ్యవహరించారు. ఆ సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన ఇటీవల తప్పు పట్టారు. ఆయన మాటల్లోనే విందాం. ‘రైతులు నిరసనలు చేస్తున్న సమయంలో ట్విటర్ ను రైతు ఉద్యమానికి  దూరంగా ఉంచాలని బీజేపీ ప్రభుత్వం హెచ్చరించింది. రైతుల నిరసన, ఉద్యమాన్ని ప్రోత్సహితస్తున్న వారి ఖాతాలను తొలగించాలని ఒత్తిడి తెచ్చింది. అలా చేయకుంటే భారత్ లో ట్విటర్ బ్యాన్ చేస్తామని, కార్యాలయాలను మూసి వేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై ఐటీ రైడ్స్ చేయిస్తామని కూడా హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ లాంటి దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ అంటూ జాక్ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Narendra Modi : వాహ్.. మోదీ.. దేశ ప్రజలను మెప్పించిన ఏకైక నాయకుడు

    PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ.. తనదైన శైలిలో పాలననందిస్తూ...

    Vaccine War viral Video : ‘వాక్సిన్ వార్’పై ప్రధాని కామెంట్స్.. వీడియో వైరల్..

    Vaccine War viral Video : బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి...

    Global Leader : అందమైన దృశ్యంలో.. గ్లోబల్ లీడర్ ఎవరో గుర్తు పట్టారా..?

    Global Leader : ప్రకృతి తాను ఒక మహోన్నతమైన వ్యక్తి ఆకారాన్నిమలుచుంది....

    Special Parliament Sessions : కొత్త పార్లమెంట్ లో చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. మోదీ ప్రకటన

    Special Parliament Sessions : ఢిల్లీలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు...