
Global Leader : ప్రకృతి తాను ఒక మహోన్నతమైన వ్యక్తి ఆకారాన్నిమలుచుంది. ఇది కాకతాలీయమా.. లేక మానవ సృష్టా అనేది కొంచెం పక్కన పెడితే ఇలాంటి ఇమేజ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రముఖమైన వ్యక్తుల నుంచి నటుల వరకు ప్రతీ ఒక్కరి ఫొటోలు ప్రకృతి తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.
గోకర్ణలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్రెంచ్ టూరిస్ట్ దీన్ని తన కెమెరాలో బంధించాడు. గ్లోబల్ లీడర్ నరేంద్ర మోడీ ఆకారంలో చెట్లు, చిన్నపాటి పర్వతాలు ఉన్నాయి. వీటిపై మొలిచిన గడ్డి.. బండలు, ఆయన ధరించిన కోటుగా కనిపిస్తుండగా.. తాటి చెట్లు (లేదా షో చెట్లు) ఏముగా పెరిగి నరేంద్రమోడీ ముఖ ఆకారాన్ని కలిగి ఉన్నాయి.
మోడీ ప్రకృతి ప్రియుడు.. భూగోళం మొత్తాన్ని గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడాలని, ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దేశంలో అయితే స్వచ్ఛతా హీ సేవా లాంటి కార్యక్రమాలు రూపొందించి పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రకృతికి అనుసంధానంగా జీవించాలని సూచించాడు. ఇలా మోడీ చేసే పనులకు పులకించిన ఆ ప్రకృతి ఆయన ఆకారాన్ని తీర్చిదిద్దింది. మరీ క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఈ చిత్రంలో మోడీ ముఖం ఉన్నట్లు కనిపించదు.
దీన్ని చూసిన నెటిజన్లు సంతోషంగా షేర్ చేస్తున్నారు. మహోన్నత వ్యక్తికి ప్రకృతి మంచి బహుమతి ఇచ్చిందని కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు. మోడీ ఒక్క భారత్ కే కాకుండా యావత్ ప్రపంచానికి ప్రకృతితో అనుసంధానంగా జీవించాలని పిలుపునిస్తున్నారు. గతంలో జరిగిన చాలా సమ్మిట్ లలో కూడా ఆయన గ్లోబల్ వార్మింగ్ గురించి అనేక హెచ్చరికలు చేశాడు. దీన్ని వెంటనే నియంత్రించకుంటే ఒక్క మానవ జాతికే కాకుండా సమస్త జీవరాశి కూడా నాశనం అవుతుందని తెలిపారు.