
Karnataka Congress : కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగగా మూడు రోజుల అనంతరం మే 13న కౌంటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. హోరా హోరీగా పోటీ జరిగినా ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ కు వైపే మొగ్గు చూపాయి. మ్యాజిక్ ఫిగర్ ను దాటి (3 గంటల వరకు) ఇంకా 25కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్.
ఆ రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలు ఉంటే అందులో మ్యాజిక్ ఫిగర్ 113. అయితే మ్యాజిక్ ఫిగర్ ను దాటి మరీ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఓవరల్ గా చూసుకుంటే దాదాపు 138 సీట్ల వరకూ సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ 70 స్థానాల వరకూ దక్కించుకోవచ్చు. ఇక జేడీఎస్ గురించి చెప్పుకుంటే 20 స్థానాల వరకే పరిమితమ్యే ఛాన్స్ ఉంది.
కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విజయం పార్టీ ప్రతీ కార్యకర్తకు అంకితం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ పని చేశారని వారి శ్రమ ఫలించిందన్నారు.
కర్ణాటక ప్రజలకు చిదంబరం ధన్యవాదాలు తెలిపారు. కన్నడ నాట కాంగ్రెస్ విజయంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ. భారత రాజ్యంగ విలువలను కాపాడుకోవడంతో పాటు ఆదిపత్య సిద్ధాంతాలు, పక్షపాత ధోరణితో వాటిల్లే నష్టాలను అరికట్టే ప్రయత్నం ఇది’ అంటూ ఆయన ట్విటర్ లో రాసుకున్నారు. బీజేపీ అర్ధ, అంగ బలానికి ప్రజలు ఎదురొడ్డి నిలుచున్నారన్నారు.