39.6 C
India
Thursday, May 9, 2024
More

    BRS Criticism of Karnataka Congress : కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు.. ఇదేం వ్యూహమో మరి..

    Date:

    BRS criticism of Karnataka Congress
    BRS criticism of Karnataka Congress, CM KCR

    BRS criticism of Karnataka Congress : కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కావడం లేదు. అక్కడ ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఓ పార్టీ గొంతెత్తుతున్నది. కానీ అది కర్ణాటకలో కాదు.. అక్కడి ప్రతిపక్షమూ కాదు. పక్క రాష్ర్టమైన తెలంగాణలోని అధికార పార్టీ. కర్నాకటలో పాలన బాగాలేదు.. ప్రజలు తిట్టుకుంటున్నారు.. ఆందోళనలు చేస్తున్నారంటూ తన అనుకూల మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయిస్తున్నది.

    అసలు కర్నాటకలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న జేడీయూ కూడా దీనిపై గొంతెత్తడం లేదు. అయినా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే కర్ణాటకలో ప్రతిపక్షం కంటే ఎక్కువగా ఇక్కడ బీఆర్ఎస్ ఆందోళన చెందుతున్నది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవకూడదని బీఆర్ఎస్ అనుకుంది. కానీ కాంగ్రెస్సే గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో తనకు ఊహించినట్టుగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కర్ణాటకలో ఇలా ఉంది.. అలా ఉంది. ప్రజలు ఆందోళనలు చేస్తున్నారంటూ ఓ గ్లోబెల్స్ ప్రచారం చేయిస్తున్నది.

    మరి అక్కడి మిత్రుడు కుమార స్వామి కూడా దీనిపై స్పందించడం లేదు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొన్ని నెలలే గడిచింది. ఒక్కొక్క పథకం అమలు చేయడంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. గత బొమ్మై సర్కారు కంటే మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. పదేళ్లు గా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలా పక్క రాష్ర్టంలో ఉన్న అధికార పార్టీపై ఏడ్వడం మరెక్కడా  చూసి ఉండరు. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలబోతున్నదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వినిపిస్తున్నది.

    నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నో అభివృధ్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ఒకటి రెండు పథకాలు మినహా అన్ని ప్రజల దరికి చేరాయి. వీటి గురించి చెప్పుకున్నా ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు ఖాయం. కానీ ఇవన్నీ వదిలేసి ప్రతిపక్షం ధాటికి ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లినట్లు కనిపిస్తున్నది. నిజానికి సీఎం కేసీఆర్ స్థాయి రాజకీయ ఎత్తుగడలు ఇవి కావనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    karnataka congress: సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం.. హుటా హుటిన బెంగళూర్‌కు వచ్చిన సీనియర్ నేతలు..

    karnataka congress: పదేళ్లుగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైన కాంగ్రెస్ పార్టీ...

    Karnataka Formula : తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. కాంగ్రెస్ కు వర్కౌట్ అవుతుందా..?

    Karnataka Formula : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఈసీ...

    Karnataka Congress : కర్ణాటకలో పీతల పంచాయతీ.. ఇక ఆ సంక్షోభం తప్పదా..?

    Karnataka Congress : కర్ణాటక ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం పదవి...

    Hastam : ‘హస్త’వాసిని మార్చిన ‘పంచ’తంత్రం

    Hastam : వరుసగా ఓటమి పాలవుతున్న హస్తం పార్టీ (కాంగ్రెస్) తిరిగి...