
Heroine Madhavi Latha Casting Couch Comments : రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే కాస్టింగ్ కౌచ్ ను దాటాల్సిందే.. అని అప్ కమింగ్, సెటిల్డ్ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు బాహాటంగానే చెప్తుంటారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్ గానే చూస్తున్నారు నేటి తరం లేడీ ఆర్టిస్ట్. అయితే, వీటి బాధల నుంచి సెలబ్రెటీల పిల్లలు తప్పుకుంటారు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర సీమలో అడుగుపెట్టాలనుకునే వారికి మాత్రం కాస్టింగ్ కౌచ్ తప్పదు. టాలీవుడ్‌లో జరుగుతున్న ఈ చీకటి బాగోతాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. గాయత్రి గుప్తా, శ్రీరెడ్డి, మాధవీ లత ఇలా ఒక్కొక్కరుగా టాలీవుడ్‌లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. సమాజానికి వినిపించారు.
‘నచ్చావులే’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాధవీలత. ఆ తరువాత 4 సినిమాల్లో నటించింది. నచ్చావులే తర్వాత ఆమె సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కెరీర్ పరంగా సక్సెస్ దక్కలేదు. దీంతో రాను రాను అమ్మడికి అవకాశాలు తగ్గాయి. తనకు ఇండస్ట్రీలో జరిగిన సంఘటనలపై ఆమె ఇటీవల ఓపెన్ అయ్యింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా, నిలదొక్కుకోవాలన్నా దర్శకులు, నిర్మాతలు చెప్పినట్లు వినాల్సిందే. అప్పుడే అవకాశాలను ఇస్తారు. లేదంటే రెండు, మూడు సినిమాలతో ఫేడ్ ఆర్టిస్ట్ గా మిగిలిపోవాల్సిందే.
నేను హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక కో ఆర్డినేటర్ ను నన్ను సంప్రదించాడు. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేందుకు మంచి ఆఫర్ ఉంది. కాకపోతే కమిట్‌మెంట్ కావాలంటూ అడిగాడు. తనతో ఒక రాత్రి గడిపితే ఫిగర్ గురించి ప్రొడ్యూసర్లకు చెప్తాను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఆయన మాట్లాడడంతోనే కోపం వచ్చింది ఫోన్ కట్ చేశా. అదొక్కటే కాదు.. ఆ తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. నిర్మాతలు, కోఆర్డినేటర్లు డైరెక్ట్‌గా ఫోన్ చేసి నైట్ ఫ్రీనా అని అడిగేవారు.
ఓ ప్రొడ్యూసర్ అయితే సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలంటే ఇలాంటివి కామనే. నాతో కమిట్‌మెంట్‌కు ఒప్పుకుంటే మంచి మంచి ఆఫర్లు ఇస్తాను.. వస్తావా? అని అడిగాడు. దీంతో కోపం పట్టలేక చెప్పుతో కొడతా అని ఫోన్ పెట్టేశా. తర్వాత, అటు తర్వాత ఇలాంటి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్ని సార్లు కుదరదు అని చెప్పినా ఒప్పుకునేంత వరకు కాల్స్ వస్తుంటాయి కావచ్చు అన్నకున్నా. ఇలాంటివి బయటకు కూడా చెప్పలేం ఎందుకంటే ఇండస్ట్రీలో పాపులర్ అయ్యేందుకు ట్రిక్స్ యూజ్ చేస్తుందని ఆరోపణలు వస్తాయి.
ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న వారు ఎంతో మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కదా? పాపం వారికి మరో దిక్కులేక వారి శరీరాలను అప్పగించాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇండస్ట్రీలోని దర్శకులు, నిర్మాతల్లో మార్పు రావాలి. అయితే తనను ఎవరు కాస్టింగ్ కౌచ్ కు గురిచేయాలనుకున్నారో వారి వివరాలను ఆమె బహిర్గతం చేయలేదు. వారిపై ఆధారపడిన ఎంతో మంది జీవితాలు ఆగం అవుతాయనే చెప్పడం లేదు అని పేర్కొంది మధవీ లత.