33.2 C
India
Monday, February 26, 2024
More

  TTD Annual Budget: వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం.. ఎన్ని కోట్లంటే?

  Date:

   

   

  ఏపి: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడింది. హిం దూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది.

  అలాగే లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠ, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

  మరిన్ని టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే…

  • స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు రూ.148 కోట్లతో టెండర్ ఆమోదం..
  • రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు..
  • ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు.
  • టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం.
  • అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయింపు.

  టీటీడీ 2024-25 వార్షిక బడ్జెటుకు రాబడి వివరాలు…

  • హుండీ ఆదాయం రూ.1611 కోట్ల అంచనా..
  • బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా రూ.1068.51 కోట్ల అంచనా..
  • లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.550 కోట్లు..
  • దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.468 కోట్ల అంచనా..
  • గదుల వసతి సౌకర్యం ద్వారా రూ.142 కోట్లు..
  • పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు..
  • అగర్బత్తి, టోల్ గేట్, విద్య కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు..
  • కళ్యాణ కట్ట ద్వారా రూ.226.50 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.

   

  Share post:

  More like this
  Related

  Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

  Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Tirumala Updates : తిరుమల వెళ్తున్నారా? కొత్త రూల్స్ ఇవే..

  Tirumala New Rules : ప్రపంచ వ్యాప్తంగా Uఉన్న హిందూ దేవాలయాల్లో...

  AP Weather : ఏపీ లో మండుతున్న ఎండలు..

  AP Weather : ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే...

  DSC : డీఎస్సీ దరఖాస్తులు.. వయోపరిమితి ఎంతంటే ?

      AP: ఆంధ్రప్రదేశ్ లో  6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి ఒకటి, రెండు...

  Kumari Aunty : చంద్రబాబుకు ఓటు వేశానన్న కుమారి ఆంటీ.. టిడిపి-వైసిపి వార్.

    Kumari Aunty : తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబుకి ఓటు వేశానంటూ...