
Wife at home : భార్యాభర్తల బంధంలో ఎలాంటి రహస్యాలు ఉండవు. కలతలు లేని కాపురం చూడముచ్చటగా ఉంటుంది. నూతన దంపతుల అన్యోన్యత చూస్తే అందరికి ముచ్చటేస్తుంది. వారి ప్రేమ అందరిని ఆకర్షిస్తుంది. పెళ్లి అయిన వారు సైతం మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందని భావిస్తుంటారు. జీవిత భాగస్వామి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. కంటికి రెప్పలా కాపాడుకునే సతి లేదనే ఆలోచన కూడా ఎంతో వేదన కలిగిస్తుంది.
మహారాష్టకు చెందిన దివ్య, వికాస్ భార్యాభర్తలు. వీరు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. అతడు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఇంట్లోనే ఉంటోంది. కానీ ఏమైందో ఏమో కానీ అతడికి ఓ ఫోన్ వచ్చింది. నువ్వు త్వరగా ఇంటికి రా అని. దీంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. భార్యను అలా చూసి షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించాడు.
ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆమె ఎందుకు పురుగుల మందు తాగిందో తెలియదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే అవసరం ఏమొచ్చిందని భర్త విలపించాడు. దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. వివాహిత మరణంపై కన్నీరుమున్నీరుగా ఏడ్చాడు. అనారోగ్యంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొంది.
భర్త మాత్రం తన భార్య ఆత్మహత్య చేసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నాడు. తనను విడిచి వెళ్లినందుకు గుండెలవిసేలా రోదించాడు. తనకు ఇక దిక్కెవరని కన్నీరు కార్చాడు. దివ్య, వికాస్ ల దాంపత్యం చూసి అందరు మురిసిపోయేవారు. ఆ దేవుడికి కన్నుకుట్టినట్లు ఉందని అంటున్నారు. అన్యోన్యమైన జంట ఆగమైంది. అతడి బతుకు భారమైంది.