31.9 C
India
Sunday, April 19, 2026
More

    వైఎస్ భాస్కర్ రెడ్డికి దక్కని ఊరట

    Date:

    Breaking news: ys bhaskar reddy arrested in ys vivekananda reddy murder case
    ys Bhaksar reddy

    ఆంధ్రపదేశ్ రాష్ర్టంలో   సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు దూకుడు  పెంచారు.  ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు

    నేటితో ఆయన రిమాండ్ గడువు ముగిసింది. దీనితో అధికారులు ఆయనను నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అదే సమయంలో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్ మీదా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా వాడివేడిగా వాదనలు సాగాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ తరఫు న్యాయవాదులు గుర్తు చేశారు.

    జూన్ 30వ తేదీ నాటికి విచారణను ముగించాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని రిమాండ్‌కు అప్పగించాలంటూ విజ్ఞప్తి చేశారు సీబీఐ తరుపున న్యాయ వాదులు …  బెయిల్ ఇస్తే సాక్షులను  ప్రభావితం చేసే అవకాశం కూడా ఉన్నందున బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తాను సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరించానని వైఎస్ భాస్కర్ రెడ్డి చెప్పారు.

    అధికారులు అడిగిన సమాచారానికి అనుగుణంగా సమాధానాలను ఇచ్చానని, బెయిల్ ఇప్పించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాదులు  వాదోపవాదాలను ఆలకించిన తరువాత- బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. సీబీఐ అధికారుల విజ్ఞప్తి మేరకు రిమాండ్‌ను పొడిగించారు. మే 10వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

    కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్ రెడ్డి కుమారుడు, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ముందస్తు బెయిల్ పిటీషన్‌పై వాదనలను ఆలకించింది. అనంతరం దీనిపై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Journalists Revathi : జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్ కు బెయిల్

    Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన...

    Chandrababu Bail : చంద్రబాబుకు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

    Chandrababu Bail : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో...

    Avinash Arrest : అవినాష్ అరెస్ట్ కు సీబీఐ ఏర్పాట్లు

    Avinash Arrest : కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు...

    Kadapa MP Avinash : అవినాష్ అరెస్ట్ తప్పదా..?

    నేడు సీబీఐ ముందుకు కడప ఎంపీ Kadapa MP Avinash :...