- నేడు సీబీఐ ముందుకు కడప ఎంపీ

Kadapa MP Avinash : వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని శుక్రవారం విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఇటీవలే ఆయన హాజరు కావాల్సి ఉన్నా, వ్యక్తిగత కారణాలతో రావట్లేదని ఆయన సమాచారం ఇచ్చారు. తాజాగా శుక్రవారం రావాలని సీబీఐ నోటీసులు పంపింది..
వివేకా హత్య కేసులో కీలకంగా వినిపించిన వారందరినీ సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు కూడా జూన్ 30లోగా ఈ కేసును పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ కేసు దర్యాప్తులో వేగం పెంచింది. బెయిల్ పై ఉన్న నిందితులను కూడా అరెస్ట్ చేయించి జైలు కు పంపించింది. ఇక అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అవినాష్ ను కూడా ఇప్పటికే ఏడు సార్లు విచారించింది.
అయితే అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అవినాష్ అరెస్ట్ అయితే వైసీపీకి ఇది పెద్ద తలనొప్పిలా మారే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి కూడా ఈ హత్య విషయం తెలుసు అనే వదంతుల నేపథ్యంలో సీబీఐ తర్వాతి అడుగు ఎలా ఉంటుందోననే చర్చలు బయటకు వస్తున్నాయి. బాబాయ్ హత్య విషయం తెలిసీ జగన్ మౌనంగా ఉండడాన్ని మెజార్టీ ప్రజలు తప్పుపట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తన అన్నపై నమ్మకం లేదని ప్రకటించిన వివేకా కూతురు సునీత వైసీపీకి చేయాల్సిన డ్యామేజ్ అంతాచేసింది. ఇక సీబీఐ అవినాష్ ను అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయని రెండు తెలుగు రాష్ర్టాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం.