Dastagiri Petition : హైదరాబాద్: మాజీమంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సిబిఐ కోర్టులో ప్రొటె క్షన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
తన కుటుంబానికి ఏపీ సీఎం జగన్, ఆయన సతీ మణి భారతి, అవినాష్ రెడ్డి, దేవి రెడ్డి, శివశం కర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రా ణహాని ఉందని పిటీషన్ దాఖలు చేశారు.
సిబిఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశా లు ఇవ్వాలని కోరారు. ఈ పిటీషన్ పై కోర్టు విచార ణ చేపట్టనుంది. మరో వైపు ఎంపీ అవినాష్ బెయి ల్ రద్దు చేయాలని దస్తగిరి హై కోర్టు లో పిటీషన్ వేశారు.