Deadline in Viveka’s murder case : కడపలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు సీబీఐ విధించిన గడువు నేటితో ముగిసింది. అయితే సీబీఐ ఏం తేల్చిందన్నదే ఉత్కంఠగా మారింది. గతంలో సుప్రీం కోర్టు జూన్ 30 లోగా తేల్చాలని గడువు విధించింది. ఈ నేపథ్యంలో మరి సీబీఐ పూర్తిస్థాయి విచారణ ముగించినట్లు కనిపించడం లేదు.
అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ముందుగా విచారణకు సహకరించలేదని సీబీఐ పేర్కొంది. దీంతో విచారణ జాప్యమవుతున్నది. దీంతో పాటు నిందితుల వెనుక ఒక బలమైన శక్తి ఉందని, విచారణ ముందుకెళ్లకుండా అడ్డుకుంటున్నదని చెబుతూ వచ్చింది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి కి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వైఎస్ వివేకానంద కూతురు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని వాదిస్తున్నది. దీంతో ఈ అంశంపై వచ్చే నెల 3న విచారణ జరగబోతున్నది. ఏదేమైనా సీబీఐ మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలున్నా వేగంగా ముందుకెళ్లడం లేదనే అపవాదు మూటగట్టుకున్నది. మరికొంత సమయం కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశమున్నట్లు సమాచారం, అయితే ఈ కేసులో ఒకరిద్దరిపై త్వరలోనే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయబోతున్నట్లు కూడా సమాచారం అందుతున్నది. వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపైనే ఈ చార్జిషీట్ ఉంటుందని సమాచారం అందుతున్నది. అయితే ఈ కేసులో జైలులో ఉన్న నిందితులకు రిమాండ్ ను మరింత పొడిగిస్తూ. హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులకు రిమాండ్ జూలై 14 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.
ReplyForward
|