SpiceJet : విమానయాన రంగంలోనూ కొలువుల కోత ప్రారంభమైంది. లో బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ 1,000 నుంచి 1,350 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఎంతమందిని ఇంటికి పంపించాలనే విషయంపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పైస్‌జెట్ అధికార వర్గాలు చెప్పాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించక తప్పదని స్పైస్‌జెట్‌కు చెందిన అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ తీసివేతలతో ఏటా కనీసం రూ.100 కోట్లు ఆదా అవుతాయని కంపెనీ భావిస్తోంది.
Breaking News