23.8 C
India
Sunday, August 9, 2026
More

    Adipurush First Review : ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ప్రభాస్ కు భారీ హిట్ ఖాయమేనా..?

    Date:

    Adipurush first review
    Adipurush first review

    Adipurush first Review : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హిట్ కొట్టి దాదాపు ఏడేళ్లు దాటిపోయింది.. బాహుబలి సిరీస్ తర్వాత ఈయన నటించిన రెండు సినిమాలు దారుణమైన నష్టాలను చవి చూశాయి.. బాహుబలి అంతటి ఘనమైన హిట్ అందుకున్న తర్వాత ప్రభాస్ కు పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఈయన వెంట వరుసగా నిర్మాతలు క్యూ కట్టారు..

    ప్రభాస్ కూడా అలాంటి లైనప్ నే సెట్ చేసుకుంటూ వచ్చాడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను ప్రకటిస్తూ తోటి హీరోలకు నిద్ర లేకుండా చేసాడు.. అయితే ఈయన బాహుబలి తర్వాత నటించిన రెండు సినిమాలు దారుణమైన ప్లాప్ అయ్యాయి.. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈయన మరో సాలిడ్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే..

    ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో ”ఆదిపురుష్” ఒకటి.. ప్రభాస్ కూడా ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఆదిపురుష్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తిండి నిద్ర లేకుండా కష్టపడ్డారు అంటూ ప్రభాస్ ఆయనను ఆకాశానికి ఎత్తారు.. ఈ మధ్యనే తిరుపతి వేదికగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయనను రాముడి పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈ నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పటికే భారీ స్థాయిలో ప్రమోషనల్ కంటెంట్ వదిలారు..

    మరి ప్రభాస్ ఫ్యాన్స్ దాహాన్ని ఆదిపురుష్ తీరుస్తుందా? మూవీ టాక్ ఎలా ఉండబోతుంది? ఆదిపురుష్ మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఈ సినిమా అప్పుడే రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిలిం క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు అప్పుడే ప్రభాస్ సినిమాకు రివ్యూ ఇచ్చేసారు.

    రాధేశ్యామ్ సమయంలో ప్రభాస్ సినిమాను ఆకాశానికి ఎత్తిన ఉమర్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు మాత్రం దారుణమైన రివ్యూ ఇచ్చేసాడు.. ఉమర్ సంధు తన అభిప్రాయం ప్రకారం ఆదిపురుష్ సినిమా టార్చర్ అని.. ప్రభాస్, కృతి సనన్ జోడీ బాక్సాఫీస్ బాడ్ లక్ కంటిన్యూ అని రివ్యూ ఇచ్చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు..

    ఈ మూవీ ఏ మాత్రం మెప్పించలేదు అని తన ట్వీట్ లో ఆదిపురుష్ భారీ బడ్జెట్, విఎఫ్ఎక్స్, క్యాస్టింగ్, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన డిజాస్టర్ అని చెప్పుకొచ్చాడు.. మూవీలో ఆత్మ లోపించింది అని నటులు పెర్ఫార్మెన్స్ అయితే దారుణం అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ అయితే నటనలో శిక్షణ తీసుకోవడం బెటర్ అంటూ.. రేటింగ్ అయితే దారుణంగా 2/5 ఇచ్చాడు.. ఈయన ఇచ్చిన రివ్యూతో ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఈయన రివ్యూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Collections : ఆదిపురుష్‌ 19 రోజుల కలెక్షన్లు ఇవే.. కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన వైనం..!

    Adipurush Collections : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన...

    Adipurush Not Good : ఆదిపురుష్ అస్సలు బాలేదు.. హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు..

    రామాయణాన్ని తీస్తే మన సౌత్ వారే తీయాలి.. సుమన్ సంచలన...

    Adipurush 4th day : ఆదిపురుష్ కు 4 రోజుల్లో వచ్చిందెంత? ఇంకా రావాల్సిందెంత?

    Adipurush 4th day : ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్...

    Aadhi Pursh Review : రికార్డులు బద్దలు కొడుతున్న ఆదిపురుష్

      Aadhi Pursh Review : ఆదిపురుష్ రికార్డుల మోత మోగిస్తోంది. ప్రపంచ...