CAA Notification : ఇది శాంతికి మార్గం. ఇది ప్రజాస్వామ్యం యొక్క నిజమైన చర్య అని ఆఫ్రికన్ అమెరికన్ నటి, గాయనీ మేరీ మిల్ బెన్ ట్వీట్ చేశారు. క్రైస్తవు రాలిగా, విశ్వాసం ఉన్న మహిళగా, మత స్వేచ్ఛ కోసం ప్రపంచ న్యాయవాదిగా నేను మోడీని అభినందిస్తున్నాననీ ఆమె తెలిపారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి హింసించ బడిన ముస్లిమేతర వలసదారులు, క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీల కు భారత జాతీయ తను మంజూరు చేస్తూ పౌర సత్వ (సవరణ) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం అభినంద నీయం అన్నారు.