36.5 C
India
Friday, April 10, 2026
More

    కొత్త సచివాలయం తర్వాత అంతకుమించి కేసీఆర్ మరో నిర్మాణం

    Date:

    తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నిమ్స్ రూపురేఖ‌ల‌ను మార్చాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పుడున్న ఆసుప‌త్రిని మ‌రింత‌గా విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం నిమ్స్ 1500 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యాన్ని క‌ల్గి ఉంది. దీన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం 3500 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యానికి పెంచాల‌ని నిర్ణ‌యించింది. అంటే ప్ర‌భుత్వం తీసుకోబోతున్న చ‌ర్య‌ల వ‌ల్ల అద‌నంగా మ‌రో 2000 బెడ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

    కొత్తగా అందుబాటులోకి రానున్న బెడ్స్‌ను ఇన్ పెషెంట్స్‌,ఔట్ పెషెంట్స్‌, అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం వినియోగించ‌నున్నారు. ఈ స‌ర్వీసెస్ కోసం ప్ర‌త్యేక బ్లాక్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని వైద్య‌,ఆరోగ్య శాఖ నిర్ణ‌యించింది. భ‌విత్య‌త్‌లో నిమ్స్ కు వ‌చ్చే రోగుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఈ అద‌న‌పు బెడ్స్‌ను ఆరోగ్య శాఖ అందుబాటులోకి తెస్తుంది.

    మ‌రోవైపు గాంధీ ఆసుప‌త్రిపై కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిని పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. 200 ప‌డ‌క‌ల‌ను కొత్త‌గా అందుబాటులోకి తేవాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని ప్ర‌భుత్వం విభాగాల్లో అత్య‌ధికంగా ప‌బ్లిక్ కోసం హెల్త్ స‌ర్వీసెస్ అందిస్తున్న ఆసుప‌త్రి గాంధీనే. హైద‌రాబాద్‌లో నిమ్స్‌, ఉస్మానియా హాస్పిటల్ ఉన్న‌ప్ప‌టికీ..గాంధీనే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక్క‌డి నుంచే ఎక్కువ మంది రోగుల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయి.

    అందుకే ఈనెల చివ‌రి వ‌ర‌కు గాంధీ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో అందుబాటులో ఉన్న 200 ప‌డ‌క‌ల‌ను అందుబాటులోకి తేవాల‌ని వైద్య‌,ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే అధికారుల‌ను కూడా ఆ శాఖ మంత్రి హ‌రీశ్ రావు చ‌క‌చ‌కా ప‌నుల పూర్తి కోసం ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఈప‌డ‌క‌లు పూర్తైన త‌ర్వాత దీన్ని సూప‌ర్ సెష్పాలిటీ ఆసుప‌త్రిగా మార్చాల‌ని రాష్ట్ర స‌ర్కార్ భావిస్తోంది. మొత్తంగా ఇటీవ‌లే నూత‌న స‌చివాల‌యాన్ని ప్రారంభించి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిమ్స్‌, గాంధీల్లోనే అద‌న‌పు బెడ్స్‌ను ఏర్పాటు చేసి రోగుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌ని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Rythu Bandhu : రైతుబంధు అధికార పార్టీకి వరం కానుందా?

    Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు...

    Telangana Muslim : తెలంగాణ ముస్లిం జనాభా కేసీఆర్ పట్ల సంతృప్తిగా లేరా? కారణం ఇదేనా?

    Telangana Muslim : రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు బీఆర్ఎస్...

    BRS : ఆ గ్యాపే బీఆర్ఎస్ కొంప ముంచిందా? 

    BRS: తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మరో కీలక ఘట్టం నవంబర్ 30వ...