BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు 62-72, బీఆర్ఎస్ కు 46-56, బీజేపీకి 7-13, ఎంఐఎంకు 05-07 సీట్లు వస్తాయని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా ముందుకు వెళ్లింది. దీంతో బీఆర్ఎస్ కు నష్టమే మిగిలింది. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే దానికి విఘాతం కలిగించాయి.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
తెలంగాణ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రమైంది. వారు ఏం పనులు చేయలేదనే వాదనలు వచ్చాయి. కానీ సీఎం కేసీఆర్ వారిని మార్చకుండా వారితోనే ఎన్నికలకు వెళ్లడం మూర్ఖత్వమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని పథకాలు సీఎం ప్రవేశపెట్టినవే కానీ ఎమ్మెల్యేలు ఏం పనులు చేశారనే వాదనలు వచ్చాయి. దీంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు జనం ముందుకు రాలేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేకతను ఉపయోగించుకుని ఫలితాలు రాబట్టుకుంది.
దెబ్బ తీసిన కాళేశ్వరం
ఎక్కడకెళ్లినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ కు ఎన్నికల వేళ దాని పిల్లర్ కుంగుబాటు ప్రతికూలతలు తెచ్చింది. పైగా బీఆర్ఎస్ నాయకులు తప్పిదం జరిగిందనకుండా మనం ఇల్లు కట్టుకుంటే బాగా లేకపోతే మళ్లీ మర్చేసుకుంటాం కదా అని సర్దిచెప్పుకున్నారు. ఇది కూడా పెద్ద మైనస్ గానే చెబుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ అహంకార పూరిత మాటలు వారి ఓటమికి కారణాలుగా నిలిచాయని అంటున్నారు.
అహంకార మాటలు
తెలంగాణ వస్తే దొరల పాలన వస్తుందని ఏనాటి నుంచో చెబుతున్నారు. వారి అహంకార మాటలు కూడా వారి పరాజయానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. రెండు సార్లు విజయం లభించడంతో వారి మాటల్లో తేడా కనిపించింది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని గోల చేయడం తప్ప ఎంత ఎదిగినా ఒదగాలనే సూత్రాన్ని మరచిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఓటమికి ఇవన్నీ బాటలు వేశాయని పలువురు రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే..
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. బీజేపీ, బీజేపీలు రెండు ఒకటే అనే వాదన తీసుకొచ్చింది. దాని తగినట్లుగానే వారి ప్రవర్తన కూడా ఉండేది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చడం, కవితను అరెస్టు చేయకపోవడం వంటి అంశాలతో కాంగ్రెస్ ఆరోపణలకు ఊతం ఇచ్చినట్లు అయింది. దీంతో బీఆర్ఎస్ ఓటమి అంచుల్లోకి వెళ్లిందనే అంచనాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే అధికార పార్టీ ఆశలు గల్లంతే అని తెలుస్తోంది.