Bigg Boss Divi కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పేరును మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వినిపించేలా చేస్తున్నారు. ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూనే ఉన్నారు.. మరి తాజాగా మరో తెలుగు బ్యూటీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి..
యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ లలో దివి ఒకరు.. ఆ తర్వాత ఈ భామ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ భామ యూట్యూబ్ లో వీడియోలు, కవర్ సాంగ్స్, ఒరిజినల్ వీడియో సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది.
అలాగే సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ పుష్ప 2 లో నటిస్తుంది.. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ విందు చేస్తుంది. ఇదిలా ఉండగా ఈమె కూడా తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
కాస్టింగ్ కౌచ్ అనేది మనం చూసే దాన్ని బట్టి ఉంటుందని.. కొందరు అవకాశాల కోసం కమిట్మెంట్స్ ఇస్తారు.. అలంటి వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు.. ఎవరిష్టం వారిది.. కాకపోతే ఒకసారి కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ దానిపై మాట్లాడ కూడదు.. అలాంటి వారు ఏం చేసిన చెల్లుతుంది అనుకోవద్దు.. అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..