Twitter War : తెలంగాణలో, ఏపీలో పరిపాలనను పోల్చుతూ వైసిపి ట్విట్టర్లో ఓ వీడియోలు పోస్ట్ చేసింది. తెలంగాణలో రేషన్ కార్డులు ఇతర పథకాల కోసం లైన్లో నిలబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంది. దళారుల చేతులు తడపనిదే పని పూర్తి కావడం లేదని తెలంగాణ పాలన లోపాలను ఎత్తి చూపింది.
అదే ఏపీలో సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తెచ్చామని వారు తెలిపారు ప్రజలకు కష్టం రాని అని ప్రజారంజక పాలన అంటే ఇదే కదా అని వీడియోలో వైసీపీ చెప్పుకొచ్చింది. బి ఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనపై అనేక విమర్శలు చేశారు రోడ్లు బాగున్నాయి అంటే అది తెలంగాణ అని రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నా యంటే ఏపీ మొదలైందని ప్రజలు అర్థం చేసుకో వాలని అప్పుడు కేసీఆర్ ఆరోపణలు చేశాడన్నారు.
నేడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో పలు సంక్షేమ కార్యక్రమాలు కోసం ప్రజలు క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందన్న అంశంపై ట్విట్టర్లో పోస్ట్ చేయడంపై దుమారం రేగుతుంది. ఏపీ వైసీపీ చేసిన పోస్ట్ పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారు వేచి చూడాల్సి ఉంది.