
అయితే పేర్నినాని ఒకడుగు ముందుకువేసి పకోడిగాళ్లు అంటూ విమర్శలు చేశారు. సినిమా ఇండస్ర్టీ పకోడిగాళ్లు తాము ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని, సినిమాలు మాత్రమే చేసుకుందామని కూడా వాళ్లకు సలహాలిస్తే బాగుంటుందని చెప్పారు. అయితే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి అభిమానినని ముందుగా చెప్పుకున్న పేర్నినాని ఆ తర్వాత విమర్శలు చేయడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇక బొత్స సత్యనారాయణ కూడా విమర్శలకు దిగారు. చిత్రపరిశ్రమ పిచ్చుక అని చిరంజీవి అంగీకరించారా అంటూ ప్రశ్నించారు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుతునాని మాత్రం మాట్లాడాడు. అయితే గతంలో చిరంజీవి భజన చేససిన నేతలు కూడా విమర్శలు మొదలుపెట్టడంతో మెగా అభిమానులు మండిపడుతున్నారు.
అయితే మెగాస్టార్ వ్యాఖ్యలు నేరుగా ఏపీ ప్రభుత్వానికి తాకాయి. దీంతో ఒక్కసారిగా మంత్రులంతా రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు పవన్ పై విరుచుకుపడిన వారంతా ఇప్పుడు మెగాస్టార్ ను టార్గెట్ చేశారు. ఆయన ను విమర్శిస్తూ ప్రెస్ మీట్లు మొదలుపెట్టారు. ఏదేమైనా వైసీపీ నేతలు మెగా అన్నదమ్ములను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తున్నది.
ReplyForward
|