posani krishna murali పోసాని కృష్ణ మురళి ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న విషయం తెలిసిందే.. ఈయన వైసీపీకి మద్దతుగా తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఫిల్ము, టీవీ మరియు థియేటర్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా పోసాని వ్యవహరిస్తున్నారు. ఈయన తాజాగా పవన్ కళ్యాణ్ వాలంటీర్లు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ప్రెస్ మీట్ పెట్టారు..
ట్రాఫికింగ్ వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని పదిమంది బాధితుల పేర్లు చెప్పాలని పవన్ కళ్యాణ్ ను ఈయన డిమాండ్ చేసారు.. అసలు ట్రాఫికింగ్ అంటే పవన్ కు అర్ధం తెలుసా అంటూ ఫైర్ అయ్యారు. అలాగే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లను తిట్టినప్పుడు స్పందించలేదు.. చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు.. రాజకీయాల్లోకి వస్తే వారి మాట వినకుంటే ఇలా ఇంట్లో ఉండే ఆడవాళ్లను తిట్టిస్తారా?
నన్ను టార్గెట్ చేసిన పర్వాలేదు.. కానీ ఆడవాళ్లను టార్గెట్ చేస్తే వారు ఎలా తట్టుకుంటారు అంటూ చిరంజీవి వాపోయారు.. అప్పుడు నువ్వు స్పందించలేదు.. నేను అడిగితే నన్ను, నా కుటుంబంలోని ఆడవాళ్లపై దాడి చేసిన నువ్వు మాట్లాడలేదు.. ఎటు పోతున్నావు ? పవన్ కళ్యాణ్ ఎలాంటి వారిని నమ్ముతున్నావ్.. నేకైనా తెలుస్తుందా? అంటూ పోసాని జనసేనాని పవన్ ను నిలదీశారు.
లోకేష్ మా ఇంట్లో ఆడవాళ్లను తిట్టించారని బాధ పడ్డావ్? మా అమ్మ ఏడ్చింది అని ఆవేదన వ్యక్తం చేసావ్? మార్చుపోయావా? అంటూ పోసాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై తనకేమి ద్వేషం లేదని.. గౌరవం మాత్రమే ఉందని.. ప్రజలు ఆశీర్వదించినంత కాలం జగన్ అయినా పవన్ అయినా రాజకీయంగా ఎదురుగుతూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..