36.7 C
India
Thursday, May 16, 2024
More

    Nara lokesh : నాకు క్లాస్ మేట్లు.. ఆయనకు జైలు మేట్స్.. పోసానిపై లోకేష్ ఫైర్..

    Date:

    Nara lokesh
    Nara lokesh
    Nara lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సింగలూరు శాంతి ప్రసాద్‌ నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళగిరి కోర్టుకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణ మురళీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై, తన కుటుంబంపై చేసిన ఆరోపణలు ఆరోపణలు నిరూపించాలన్నారు.  ఆరోపణలు చేసిన వారు కోర్టుకు రాకుండా ఎక్కడ దాక్కున్నారంటూ ఫైర్ అయ్యారు.  కోర్టుకు హాజరు కాని పోసాని కృష్ణమురళీ పై విరుచుకుపడ్డారు.  “అయ్యా పోసానిగారు మీరే కదా నాపై ఈ ఆరోపణలు చేసింది. మరి మీకు నోటీసులు పంపిస్తే వాటిని తీసుకోకుండా ఎందుకు  తప్పించుకొంటున్నారు? మీ పార్టీయే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కనుక కంతేరు వద్ద నాకు భూములు ఉన్నట్లయితే ఆ వివరాలను, డాక్యుమెంట్లు తీయించడం మీకేమీ కష్టం కాదు కదా? అయినా ఎందుకు వెనకాడుతున్నారు? అని ప్రశ్నించారు.
     నేను పంపిన లీగల్ నోటీస్ తీసుకోకుండా తప్పించుకోవాలనుకుంటున్నారు.. న్యాయస్థానం మిమ్మల్ని విచారణకు రప్పించక మానదు. కనుక నాపై చేసిన ఆరోపణలు నిజమైతే వాటికి సంబందించి సాక్ష్యాధారాలనను సిద్ధం చేసి పెట్టుకోండి. లేదా బేషరతుగా నాకు క్షమాపణ చెప్పి పరువునష్టం కలిగించినందుకు రూ.5 కోట్లు చెల్లించండి,” అని లోకేష్‌ పేర్కొన్నారు.  అలాగే అదే సమయంలో  సీఎం జగన్ పైనా విరుచుకుపడ్డారు.
    ‘నాకు క్లాస్ మేట్స్.. ఆయనకు జైల్ మేట్స్’
    తాను ఓ నియంతపై తాను పోరాడుతున్నానని, ఓ పెత్తందారు, వైసీపీ గోబల్‌ ప్రచారంపై పోరాటం చేస్తున్నానని లోకేష్ అన్నారు. న్యాయం కోసమే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. తనది కాలేజీ లైఫ్‌ అని, జగన్‌ది జైలు లైఫ్‌ అని ఎద్దేవా చేశారు. తనకు క్లాస్‌మేట్స్‌ ఉంటే, జగన్‌కు జైల్‌మేట్స్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ సీబీఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, విదేశాలకు వెళ్లాలంటే తనకు ఎవరి అనుమతి అవసరం లేదని, కానీ జగన్‌ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలని విమర్శించారు.
    ‘మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తా’
    తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్‌ లక్షల కోట్లు దోపిడీ చేశారని, తన తాత, తండ్రి సీఎంగా ఉన్నా తాను ఏనాడూ అక్రమ సంపాదనకు పాల్పడలేదని లోకేష్ స్పష్టం చేశారు. కంతేరులో తాను 14 ఎకరాలు కొన్నానని పోసాని ఆరోపణలు చేశారని, తన పేరు మీద భూమి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.  పోసాని అసత్య ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఈ సారి మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావట్లేదని, ఉన్నవి కూడా తరలిపోతున్నాయని విమర్శించారు.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...