Athidhi Web Series :
ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా ఇండస్ట్రీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి తగ్గించేస్తున్నారు. వారి అభిమాన హీరో సినిమా మినహా వేరే సినిమాలపై పెద్దగా ద్రుష్టి పెట్టడం లేదు..
ఓటిటిలు కూడా మంచి మంచి కాన్సెప్ట్ లతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. మరి తాజాగా ఓటిటి ఆడియెన్స్ ను అలరించాడని తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో వెబ్ సిరీస్ వచ్చింది. దేవుడు మాత్రమే కాదు దెయ్యం కూడా మన కర్మలకు శిక్షను వేస్తుంది అని రుజువు చేయడానికి ఆడియెన్స్ ముందుకు వచ్చింది ”అతిథి”.. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.. మరి అతిథి వెబ్ సిరీస్ కు అద్భుతమైన రివ్యూ సొంతం చేసుకుంటూ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది..
ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సిరీస్ గురించే చర్చించు కుంటున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఏంటంటే.. ఒక రాజభవనం.. ఒక రవివర్మ.. ఈ వెబ్ సిరీస్ మొత్తం ప్రధానంగా నలుగురు మనుషుల చుట్టూనే తిరుగుతుంది.. ఈ కథలో దెయ్యం ప్రతీ క్షణం ఆడియెన్స్ ను నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది..
ఈ రాజభవనం లోకి దోచుకోవాలని ఇద్దరు, కాపాడాలని ఒకరు వెళ్లారు.. అలా వెళ్లిన తర్వాత అనూహ్యంగా అంచనాలకు అందకుండా వాతావరణం మారిపోతుంది.. మరి ఈ కథను ఎలా నడిపారు? ఈ రవివర్మ ఎవరు? అసలు కథ ఏంటి? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే..
ఒకప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి కూడా ఒక విభిన్నమైన పాత్రతో అలరించారు.. అవంతిక మిశ్రా, వెంకటేష్ కాకుమాను, రవి వర్మ ఈ వెబ్ సిరీస్ లో ప్రధానంగా కనిపిస్తారు.. వైజీ భరత్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ను మిస్ అయితే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అయినట్టే..
ReplyForward
|