Athidhi Web Series Review : ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ లో మాత్రమే కాదు ఇంట్లో కూర్చుని కూడా కొత్త కొత్త కంటెంట్ ను ఆస్వాదిస్తున్నారు. ఓటిటిలు కూడా మంచి మంచి కాన్సెప్ట్ లతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. మరి తాజాగా ఓటిటి ఆడియెన్స్ ను అలరించాడని తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో వెబ్ సిరీస్ వచ్చింది. దేవుడు మాత్రమే కాదు దెయ్యం కూడా మన కర్మలకు శిక్షను వేస్తుంది అని రుజువు చేయడానికి ఆడియెన్స్ ముందుకు వచ్చింది ”అతిథి”.. దీని రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు చూద్దాం..
నటీనటులు :
వేణు తొట్టెంపూడి
అవంతిక మిశ్రా
వెంకటేష్ కాకుమాను
అదితి గౌతమ్
రవి వర్మ
భద్రం తదితరులు..
డైరెక్టర్ : వైజీ భరత్
నిర్మాత : ప్రవీణ్ సత్తారు
మ్యూజిక్ డైరెక్టర్ : కపిల్ కుమార్
కథ : రవి వర్మ (వేణు తొట్టెంపూడి) ఒక రచయిత.. పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న భార్య సంధ్య (అదితి గౌతమ్) కు సేవలు చేస్తూ ఆమెతో ఒక అడవిలో ఉండే గెస్ట్ హౌస్ లో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒక రాత్రి కురిసిన వాన వల్ల మాయ (అవంతిక మిశ్రా) రవి వర్మ గెస్ట్ హౌస్ కు వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యాలపై వీడియోలు తీసే యూట్యూబర్ సవారీ (వెంకటేష్ కాకుమాను) కూడా ఆ ఇంటికే వస్తాడు. ఆ తర్వాత వీరి మధ్య ఏం జరిగింది? మాయ మనిషినా? లేదంటే దెయ్యమా? అసలు ఆయన ఇంటిలో ఉన్న దెయ్యం ఎవరు? ఎందుకు అలా మారింది? అనేది మిగిలిన కథ..
విశ్లేషణ :
విశ్లేషణ : డైరెక్టర్ భరత్ ఎంచుకున్న పాయింట్ బాగుంది.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగుంది.. అయితే ఆ కథను ఎమోషనల్ గా చెప్పే ఛాన్స్ ఉన్న కూడా డైరెక్టర్ చెప్పలేక పోయాడు.. క్యారెక్టర్లను పరిచయం చేసిన తీరు, వారి మధ్య జరిగిన సంభాషణ మొత్తం క్యూరియాసిటీగా అనిపించింది.. ఒక్క ఎమోషనల్ సన్నివేశాలను కూడా మరింత డెప్త్ గా చెప్పి ఉంటే ఈ సిరీస్ మరింత సస్పెన్స్ గా ఉండేది.
నటీనటుల పర్ఫార్మెన్స్ :
ఇప్పటి వరకు లవర్ బాయ్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన వేణు ఈ వెబ్ సిరీస్ లో రవి వర్మ పాత్రలో నటించారు. ఎమోషనల్ కంటెంట్, ఇంటెన్స్ ఉన్న రోల్ ను చక్కగా ఎలివేట్ చేయగలిగారు. వేణు హుందాగా తన పాత్రలో మెచ్యూరిటీ చూపించి ఆడియెన్స్ ను అలరించారు. మాయగా అవంతిక, సంధ్యగా అదితి తమ రోల్స్ తో ఆకట్టుకోగా రవి వర్మ విలనిజం బాగానే అనిపించింది.
టెక్నీకల్ పర్ఫార్మెన్స్ :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది.. కపిల్ కుమార్ వెబ్ సిరీస్ కు మంచి సపోర్ట్ గా నిలిచి తన మ్యూజిక్ తో అలరించారు.. ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ విభిన్నంగా ఉంది.
రేటింగ్ : 2.75/5.