40.2 C
India
Sunday, May 19, 2024
More

    Save the Tigers : ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ లో నటించిన ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ తెలుసా..? ఆమె చేసిన సినిమాలు ఏవో తెలుసా.?

    Date:

    Save the Tigers
    Save the Tigers, pavani gangi reddy

    Save the Tigers : ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్ విపరీతంగా స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. మగవాడిని టైగర్ గా భావించి ఆడవాళ్ల నుంచి కాపాడాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సిరీస్ ఆసాంతం ఆకట్టుకుంది. భార్య, భర్తలు వారి మధ్య జరిగే వింత వాదనలు, అత్తా, కోడలు కలి ఉండడం, విడి విడిగా ఉండడం. ఇలా చాలా వేరియంట్ కంటెంట్ ను ఇందులో జొప్పించారు. ఈ సిరీస్ ఆద్యంతం హిల్లేరియస్ గా ఉంటుంది. ‘హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌’పై మహి వీ రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడిగా తేజ కాకుమాను వ్యవహరించారు. ప్రధాన పాత్రలో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ నటించారు. వీరికి భార్యలుగా జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని నటించి మెప్పించారు.

    వీరిలో జోర్దార్ సుజాత, దేవయాని గురించి మనకు ఇంతకు ముందే తెలుసు. పావని గంగరెడ్డి గురించి తెలుసా.? ఈమె ఇంతకుముందు ఏ ఏ సినిమాల్లో నటించిందో తెలుసుకుందామా. పావని 2015లో శర్వానంద్-నిత్యా మీనన్ జంటగా నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ నిత్యామీనన్ స్నేహితురాలిగా నటించింది. దీనికంటే ముందు ఓ షార్ట్ ఫిలింలో చేసింది. ‘వింద్యా మారుతం’ అనే షార్ట్ ఫిలిమ్ లో కనిపించి ఆకట్టుకుంది ఈ అమ్మడు.

    మళ్లీ మళ్లీ ఇది రానిరోజు తర్వాత సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, జ్యో అచ్చు తానంద, రైట్ రైట్, అంతరిక్షం, మీకు మాత్రమే చెప్తాలో కూడా నటించింది. 2019లో ‘ఎక్కడికి ఈ పరుగు’ అనే వెబ్ సిరీస్ చేసింది. రీసెంట్‌గా సేవ్ ది టైగర్ లో చేసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన పావని, భారీ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్ లో టెక్నాలజీ హెడ్‌గా పనిచేసింది. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటనలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    90s A Middle Class Biopic : 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

    90s A Middle Class Biopic : ప్రస్తుత జామానా వెబ్...

    Bigg boss Siri ముందరి అందాలతో మంటలు పుట్టించిన సిరి.. మొత్తం ఓపెన్ చేసేసింది..!

    bigg boss siri సిరి హన్మంతు అంటే సోషల్ మీడియాలో సెన్సేషన్....

    Shaitan Web Series : సైతాన్ వెబ్ సిరీస్ నటిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా?

    Shaitan web series : మహి వి రాఘవ దర్శకత్వంలో హాట్...

    ‘వ్యవస్థ’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..

    తారాగణం :  కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్, కామ్నా జఠ్మలాని, సంపత్ రాజ్,...