Anasuya comments అనసూయ అంటే తెలియని ఆడియెన్స్ లేరు.. ఈ అమ్మడికి కాస్త ఫేమ్ వచ్చినప్పటి నుండి ట్రోల్స్ చేతికి ఏదో ఒక విషయంలో చిక్కుతునే ఉంది.. తన జబర్దస్త్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈమె పై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.. కానీ ఈమె స్టార్ యాంకర్ గా అయ్యి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఈ ట్రోల్స్ పై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తుంది.
ఇక ఇప్పుడు ఈ భామ పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాల మీదనే ద్రుష్టి పెట్టింది.. వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో వెండితెరపై తన పేరును ముద్రించుకుంది.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తుంది. పార్ట్ 1 లో దాక్షాయణి పాత్రలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన ఈ భామ సెకండ్ పార్ట్ లో కూడా ఉంది. ఈమె పాత్రను సుకుమార్ మరింత నిడివితో రాసినట్టు సమాచారం. ఇటీవలే ఈమె తన రోల్ కోసం షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
ఇదిలా ఉండగా అనసూయ ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.. గంగోత్రి సినిమా సమయంలో ఈమె బన్నీపై కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారు? గంగోత్రి మూవీ చుస్తే అసలు మనవాళ్లకు ఏమైంది అని అనుకున్న.. ఇంకా లేడీ గెటప్ వేసి చేసిన పాట అయితే అబ్బో.. అంటూ ఈమె అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.