Naga Chaitanya భారీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ పరిశ్రమలోకి వచ్చిన యువ హీరో నాగచైతన్య కెరీర్ అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగడ లేదు. 2009 లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని నట వారసుడికి చెప్పుకోదగ్గ హిట్లు వేళ్ల మీద ఉన్నాయి. తాతలు ఏఎన్నార్, రామానాయుడు, తండ్రి టాప్ హీరో నాగార్జున, మేనమామల్లో ఒకరు టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కాగా, మరొకరు టాప్ హీరో వెంకటేష్. ఇంత సపోర్ట్ ఉన్నా పెద్దగా సక్సెస్ అవలేదు. వచ్చిన హిట్లు కూడా అంతంత మాత్రమే.
యువ హీరో నాగచైతన్య తన తదపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. చందూ మొండేటి డైరెక్షన్లో చై పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా చేస్తున్నాడు .గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తున్నది. మత్స్యకారుల జీవితాల్లోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.
తన కొత్త సినిమా లో క్యారెక్టర్ కోసం నాగ చైతన్య ప్రీ వర్కౌట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మత్స్యకార కుటుంబాల గురించి తెలుసుకునేందుకు నాగచైతన్య శ్రీకాకుళం జిల్లా లోని ఎచ్చెర్ల మండలంలోని కే మత్స్యలేశం గ్రామంలో పర్యటించాడు. చైతన్యంతో పాటు డైరెక్టర్ చందు, నిర్మాత బన్నీ వాసు కూడా అక్కడికి వెళ్లారు. సినీ హీరో, దర్శకులు తమ గ్రామానికి రావడంతో వారిని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు.
ఆరునెలల క్రితమే చందూ కథ చెప్పారు. కథను విని నేను చాలా ఇన్ స్పైర్ అయ్యాను. అందుకే మత్స్య కారులతో మాట్లాడటానికి ఇక్కడికి వచచ్చినట్లు చెప్పాడు. వారి జీవన విధానం, స్థితిగతులను నేరగా పరిశీలిండానికి వచ్చినట్ల చెప్పాడు. శ్రీకాకుళం మత్స్యకారుల యాస, వ్యవహార శైలి తెలుకున్నానని చెప్పాడు. 2018లో గుజరాత్ విరావల్ నుంచి 21 మది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ జాలర్లను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ బంధించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సంప్రదింపులు చేయడంతో మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ జాలర్ల కథ ఆధారంగే నాగ చైతన్య కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీలో పాక్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కిన మత్స్యలేశం గ్రామానికి చెందిన జాలరైన గణగల్ల రామరావు పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.
నాగ చైతన్యకు ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ఒకేసారి రెండు సెంటిమెంట్లు ఈ సినామాతో టచ్ అవుతున్నాయి. ఒకటి తనకు మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన బ్యానర్ గీతా ఆర్ట్స్. ఈ బ్యానర్ పై వచ్చిన 100 % లవ్ సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఎన్నో ప్లాఫ్ ల తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో మలయాళ రీమేక్ ప్రేమమ్ సినిమా నాగ చైతన్యకు మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఒకేసారి రెండు సెంటిమెంట్లు కలిసి వస్తుండడంతో వర్కౌట్ అవుతుందని చై చాలా నమ్మకంతో ఉన్నాడు.