Nara Lokesh :
అయితే తాజాగా కొత్త అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ యువనేత లోకేశ్ ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఆయన తమ పార్టీ ఎంపీలతో కలిసి ప్రధానిని కలవబోతున్నట్లుగా తెలుస్తున్నది. అయితే జనసేన అధినేత పవన్ కూడా ప్రధాని ని కలవబోతున్నట్లుగా తెలుస్తున్నది. అయితే వీరిద్దరు ఒకేసారి కలుస్తారా.. వేర్వేరుగా కలుస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీ ప్రస్తుతం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల బిజీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అపాయింట్ మెంట్ దొరకడం కష్టమే. ఈనెల 23 తర్వాత ఆయన అపాయింట్ మెంట్ దొరికే అవకాశం ఉంది. అయితే అప్పటివరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారని టాక్ నడుస్తున్నది.
మరోవైపు నారా లోకేశ్ ఢిల్లీ నుంచి రాగానే ఏపీలో అరెస్ట్ చేసేందుకు సీఐడీ సన్నద్ధమవుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే నారా లోకేశ్ ఢిల్లీలో ఉంటున్నారని వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. అయితే నారా లోకేశ్ త్వరలోనే ఏపీకి తిరిగి వస్తారని, మళ్లీ యువగళం పాదయాత్ర మొదలుపెడుతారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని చెప్పుకునే అవకాశం ఇప్పుడు పాదయాత్రలో ఆయనకు ఉంటుందని తెలుస్తున్నది. మరోవైపు నారా లోకేశ్ అరెస్ట్ అయితే నారా బ్రాహ్మిణి పాదయాత్ర చేస్తారనే టాక్ వినిపిస్తు్న్నది.