Kotasrinivasarao సినీ ఇండస్ట్రీలో తమ విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే వారు కొందరు మాత్రమే.. మరి ఆ కొందరిలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఒకరు.. ఈయన కొన్ని వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. తెలుగు సినీ పరిశ్రమలో ఏ పాత్రలో అయిన నటించి మెప్పించగలిగే కోటా అంటే అందరికి సుపరిచితమే..
ఈయన తండ్రిగా, విలన్ గా, కమెడియన్ గా చేసి కొన్ని దశాబ్దాల నుండి తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు. ఏ పాత్ర ఇచ్చిన అందులో జీవించడం ఆయనకే సాధ్యం.. 1978లో మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు.. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.. తెలుగు, తమిళ్, జిందే, కన్నడ భాషల్లో నటించి వందల సినిమాల్లో ఆడియెన్స్ ను తన సహజమైన నటనతో కట్టి పడేసాడు.
ఇప్పుడు వృద్ధాప్యంలో ఉండడంతో ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.. ఒకసారి మధ్యాహ్నం వరకు షూట్ లేదన్నారు.. సెట్ కు వెళ్ళాక చెప్పడంతో ఏం చేయాలో తెలియలేదు.. అదే సమయంలో ఎంఎస్ నారాయణ నా దగ్గరకు వచ్చి షూట్ లేదన్నారు కదా అలా బయటకు వెళదాం అన్నాడు..
ఇద్దరం కలిసి అలా సరదాగా బయటకు వెళ్లి మందు తాగాం.. ఆ వెంటనే షూట్ కు రమ్మని కబురు వచ్చింది. వెంటనే మేము షాట్ కు వెళ్లాం.. అక్కడ చిరంజీవి ఉన్నారు. తనకు ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు కానీ మీరు మందు తాగారా అని అడగడంతో అవును అని చెప్పడంతో చిరు మమ్మల్ని తిట్టారు. ఇండస్ట్రీలో మీకంటూ ఒక పొజిషన్ ఉంది.. ఇలాంటి సమయంలో తాగి సెట్ కు రావడం ఏంటని ఇతర నటీనటులు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు అంటూ సీరియస్ అయ్యారు. నా గురించి మంచి చెప్పే వారిలో చిరంజీవి ఒకరు.. అంటూ ఈయన అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.