40.2 C
India
Sunday, May 19, 2024
More

    CM YS Jagan : ఆ అధినేతల్లో టెన్షన్.. సీట్ల పంపకాలు తేలేనా..?

    Date:

    AP CM Ys Jagan
    AP CM Ys Jagan
    CM YS Jagan : ఏపీలో ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం ఉందని సీఎం జగన్ ప్రకటించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని, సమయానికే ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. అయితే వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి నిలవాలని యోచిస్తున్నది. వీలైతే కేంద్రంలోని బీజేపీ సాయం తీసుకోవాలని మాత్రం భావిస్తున్నది. బీజేపీని టీడీపీ వైపు వెళ్లకుండా చూసేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నది.

    అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల అంశంపై మాత్రం ఏపీలో చర్చ కొనసాగుతున్నది. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే స్పష్టంగా పొత్తులపై ప్రకటన చేశాయి. మరి బీజేపీ ఎటూ తేల్చడం లేదు. అయితే టీడీపీ, జనసేన పార్టీల్లో సీట్లు సర్దుబాటు అంశం కొంత చర్చనీయాంశమవుతున్నది. జనసేన 30 నుంచి 40 సీట్లు అడిగే అవకాశమున్నదని టాక్ బయటకు వస్తున్నది. ఇక్కడే అసలు కథ మొదలు కాబోతున్నది. ఇన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా లేరు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్ధులను టీడీపీ ఖరారు చేసింది. మరికొన్ని చోట్ల త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతన్నది. అయితే ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి చోట్ల అభ్యర్థుల ఖరారు కొలిక్కి వస్తుందా అనేది సందేహాంగానే కనిపిస్తున్నది. ఇరు పార్టీలు పట్టుకు పోతే మొదటి కే మోసం వచ్చేలా కనిపిస్తున్నది. అయితే అధినేతలు మాత్రం పొత్తు ఉంటుందని చెబుతున్నారు. అయితే వారి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని కొంత మంది భావిస్తున్నారు. అయితే కొన్ని సీట్ల పైనే ఇప్పుడు స్పష్టత రావడం లేదు. టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నచోట జనసేన పట్టుపడితే ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విజయవాడ సెంట్రల్ సీటు ఇప్పుడు రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉండబోతున్నది. అక్కడ ఇప్పటికే టీడీపీ బొండా ఉమను ప్రకటించింది. అయితే ఇక్కడి నుంచి వంగవీటి రాధా కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు.  సత్తెనపల్లిలో జనసేన కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ, కొడెల శివరాం ఉన్నారు.  తెనాలి అంశం కూడా కొంత టఫ్ గానే ఉంది. అయితే అక్కడ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. నాదెండ్లకు ఎమ్మెల్సీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ చేయబోతున్నదని సమాచారం.

    పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గాల్లో ఉండి కొందరు నాయకులు పోరాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తమను వేధిస్తున్నా, కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నా రెండు పార్టీల్లో పలువురు నాయకులు పార్టీనే నమ్ముకొని అన్నీ భరిస్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ ఇతరులకు ఖరారైతే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల రెబెల్స్ బెడద తప్పేలా లేదు. అయితే అధినేతలు పిలచి మాట్లాడితే కొందరు చల్లబడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తు న ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు ఈసారి గట్టిగా ఆశ పెట్టుకున్నవారితోనే ఇప్పుడు ఇరు పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది . మరి ఇలాంటి సమయంలో అధినేతలకు తలనొప్పి తప్పేలా లేదు. ఇరువురు పంతానికి పోతే మళ్లీ వైసీపీ ఖాతాలోకి అధికారం వెళ్లిపోతుంది. మరోవైపు ఒకడుగు తగ్గేందుకు, త్యాగాలు చేసేందుకు సిద్ధమని ఇరు పార్టీల నేతలు కొందరు ప్రకటిస్తున్నా, ఆఖరు నిమిషం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయితే టీడీపీ ఓటు బ్యాంక్ వారితోనే ఉంది. మరి జనసేన కూడా కలిస్తే వారికి విజయం సునాయసమవుతుంది. ఇలాంటి సమయంలో సీట్ల పంపకాలు అనుకున్నట్లు సరిగ్గా పూర్తయితేనే ఇక తిరుగుండదు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ అనంత లోకాలకు – రైలు ఢీకొని తల్లీకుమారుడు మృతి

    Kavali News : ఎన్నికల విధులకు వెళ్తూ రైలు ఢీకొని అంగన్...

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...