35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Policy Decisions : విధానపర నిర్ణయాల్లో సీఎంలదే బాధ్యత.. అయితే అరెస్టులు సరికొత్త ప్రజాస్వామ్యానికి సంకేతం

    Date:

    Policy Decisions
    Policy Decisions, AP CM and Ex CM

    Policy Decisions : ఏ రాష్ట్రంలోనైనా విధానపర నిర్ణయాల్లో ముఖ్యమంత్రిదే కీలక బాధ్యత, క్యాబినేట్లో తీసుకున్న నిర్ణయాలకు సీఎం హోదాలో ఆయన అనుమతినిస్తారు. వీటిని అధికార యంత్రాంగం తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే పూర్తి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై సీఎం ను బాధ్యత చేస్తూ వేధింపులకు దిగడం మాత్రం ఇఫ్పుడు ఏపీలోనే మొదలైంది. ఏపీలో స్కిల్ స్కాం కేసులో జీవోలు జారీ చేసిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు, ఫైనాన్స్ శాఖ, ప్రాజెక్టులు అమలు చేసిన అధికారులు.. ఇలా అందరూ అమాయకులే. కేవలం నిర్ణయం తీసుకున్న సీఎం మాత్రమే దోషి అన్నట్లుగా ఏపీ సీఐడీ తీరు కనిపిస్తున్నది.

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ ప్రాజెక్టులో నిధుల దుర్వినయోగం జరిగిన ఆధారాలు ఇప్పటివరకు ఏపీ సీఐడీ బయట పెట్టలేదు. కేవలం చంద్రబాబే చేయించాడని చెబుతున్నారు తప్పా, అసలు నిధులు ఎక్కడ దారి తప్పాయి. ఎక్కడికి వెళ్లాయి.. ఎవరికి ముట్టాయి.. ఎంత ముట్టాయి ఇలాంటి ఏ ఒక్క ఆధారం కూడా  అందులో లేదు. విషయం ఏంటంటే ఈ కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు చంద్రబాబుకు సన్నిహితులు అనే నెపం మాత్రం పెడుతున్నారు. కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు నిధులు మళ్లిస్తే ఏకంగా అప్పటి సీఎం చంద్రబాబే బాధ్యత అంటూ ఈ కేసులు నమోదం చేయడం చూస్తుంటే ఏపీలో అధికారులు కొత్త విధానానికి తెరదీశారు.

    అయితే అంతా నిబంధనల ప్రకారమే జరిగాయని టీడీపీ నేతలు పత్రాలు విడుదల చేశారు. అయినా చంద్రబాబును ఏదో రకంగా కొన్నాళ్లు జైలుకు పరిమితం చేయాలనే సీఐడీ అధికారుల యావ ఇందులో స్పష్టంగా అర్థమవుతున్నది. ఏకంగా రాజకీయ నాయకుల్లా ఢిల్లీ వెళ్లి మరి ప్రెస్మీట్ పెట్టడం వెనుక ఉన్న కారణం కూడా ఇలాగే చూసేవాళ్లకు అర్థమవుతున్నది.

    ఏపీ సీఎం వైఎస్ జగన్ పై గతంలో సీబీఐ అన్ని ఆధారాలు చూపించింది. నిధుల మళ్లింపు ఎలా జరిగిందో కోర్టుకు వివరించింది. కానీ ఇక్కడ సీఐడీ మాత్రం ఒక్క రూపాయి కూడా దారి మళ్లిన ఆధారం చూపించలేదు. అభియోగాలు మాత్రం కోట్లలో చేస్తున్నది. ఇలా కొంతకాలం తాత్సారం చేసి, చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలనే కుటిల ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

    అయితే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు సీఎంలను బాధ్యుడిని చేస్తూ పోతే, దేశంలో ఇలా ఎందరో సీఎం లు జైళ్లో ఉండాల్సి న పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా గత ప్రభుత్వాలపై కక్ష సాధింపు చర్యలకు దిగకు మానరు. ఇక ఏపీలో రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే ప్రస్తుత జగన్ పరిస్థితి కూడా ఇంతే కదా అనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ బికినీలో.. అందాల ఆరబోత

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ మరో సారి అందాల ఆరబోతతో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటీషన్ పై విచారణ..

    Chandrababu Bail : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ పై...

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై...

    Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్..

    Chandrababu : చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్...