38.7 C
India
Saturday, May 18, 2024
More

    Ganga River : గంగానదిలో పైసల వేట.. అయస్కాంతాలతో చిల్లర కొల్లగొడుతున్నారు

    Date:

    Ganga River
    Ganga River

    Ganga River coin Hunting : మనదేశంలో నదుల్లో డబ్బులు వేస్తుంటారు. కొందరు వాటిని కొల్లగొట్టేందుకు అయస్కాంతాలు వాడుకుని చిల్లరను దోచుకుంటున్నారు. నదిలో వేసిన వాటిని కూడా వదలడం లేదు. ఈ క్రమంలో అయస్కాంతాలతో బిళ్లల వేట కొనసాగిస్తున్నారు. నదిలో వేసిన చిల్లరను తీసుకుంటున్నారు. దీంతో ఉపాధి పొందుతున్నారు. చివరకు చిల్లరను కూడా దక్కనివ్వడం లేదు.

    మనదేశంలో నదులకు పవిత్ర స్థానం కల్పించారు. కానీ నేడు అవి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. కలుషితమైన పదార్థాలు పడేయడంతో నదులు అస్తవ్యస్తంగా అవుతున్నాయి. దీంతో వాటిలోని నీరు కాలుష్యంగా కనిపిస్తోంది. నదులను పవిత్రంగా చూసుకోవాల్సిన మనమే వాటిని పాడు చేస్తున్నాం. చెత్త, చెదారం పడేయడంతో అవి మురికి కూపాలుగా మారుతున్నాయి.

    స్వచ్ఛమైన నీటితో కనిపించాల్సిన నదులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. దేశంలో గంగానదిని అత్యంత పుణ్య నదిగా భావిస్తారు. కానీ అందులో ఉన్నంత మురికి మరే నదిలో ఉండదంటే అతిశయోక్తి కాదు. గంగానదిలో శవాలు దహనం చేయడంతో నీరంతా మురికిగా మారుతోంది. ఈ నేపథ్యంలో నదిని ప్రక్షాళన చేయాలని సంక్పల్పించినా కుదరడం లేదు.

    పూర్వం రోజుల్లో రాగి పైసలు ఉండటంతో వాటిని ఆ నదిలో వేస్తే నీరు శుభ్రమవుతుందని భావించి అందులో వేసే వారు. కానీ ఇప్పుడు కూడా రూపాయి బిళ్లలను గంగలో విసిరేస్తున్నారు. దీంతో వాటిని తీసుకుని కొందరు ఉపాధి పొందుతున్నారు. నదిలో పైసలు వేయడం వల్ల నీరు కలుషితంగా మారుతుంది. ఈ విషయం అందరికి తెలిసినా నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నారు.

    గంగ, గోదావరి, క్రిష్ణ, కావేరి, తుంగభద్ర వంటి జీవనదులు మన దేశంలో ఉన్నాయి. నదీపరివాహక ప్రాంతంలో నివసించడం మానవ నాగరికత. ఈనేపథ్యంలో నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. సహజ వనరులను కాపాడుకోకపోతే ఇబ్బందులు రావచ్చు. భవిష్యత్ బంధకారమే కావచ్చు. అందుకే ముందే మేల్కొని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Strange Animals భారత్ లో కనిపించే వింత జీవులు ఇవే.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

    Strange Animals in India : భారత ఉపఖండం చాలా విశేషమైనది....

    Railway Huge Success : రైల్వే భారీ విజయం.. గంగా నది కింది నుంచి..(వీడియో)

    Railway Huge Success : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి (2014)...