Strange Animals in India : భారత ఉపఖండం చాలా విశేషమైనది. ఇక్కడి వాతావరణం చాలా జీవులకు అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం ఒక్కో కాలం సమంగా ఉండడంతో ఇక్కడి వాతావరణంలో అనేక జీవులు మనుగడ సాగిస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ఉడుతలు నేలపై నడవడం.., లేదంటే చెట్లపై పాకడం చూస్తూనే ఉంటాం.. కానీ భారత్ లో ఎగిరే ఉడతలు కనిపిస్తాయని తెలుసా. ఇవి చెట్లలో నివసిస్తాయి. సాధారణంగా రాత్రి సమయంలో ఆహారం కోసం బయటకు వస్తుంది. దాని చర్మం ముడుచుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.
గంగా ఒడ్డున ప్రత్యేకమైన డాల్ఫిన్ జాతులు కనిపిస్తాయి. ఇవి పదునైన దంతాలు, పొడవైన సన్నని ముక్కుతో ఉంటాయి. వీటిని సుసు అని పిలుస్తారు. ఈ డాల్ఫిన్స్ ప్రపంచంలో అత్యంత జన సాంద్రత కలిగిన వాటిలో ఒకటి. ఇది కాంతిని కూడా గుర్తిస్తుంది.
ఐదు సెంటీ మీటర్ల పొడవు ఉండే ఈగలు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భారత్ లో ఉన్నాయి. ఆగ్నేయ ఆసియా, ఆసియాలో కూడా కనిపిస్తాయి. వీటి విషం ప్రమాదకరమైనది. మనుషుల మరణానికి కూడా దారి తీస్తుంది.
భారత్ లో కనిపించే నల్ల తేలు పొడవైనది. ఇది 10 సెం.మీ వరకు ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు. దీని విషయంలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయట. శాస్త్రవేత్తలు వీటిపై కూడా అధ్యయనం చేస్తున్నారు.
అనేక రకాల పెద్దపిల్లి జాతులున్నాయి. వీటిలో రాయల్ బెంగాల్ టైగర్, మౌంటెన్ చిరుత, ఏషియాటిక్ లయన్, మంచు చిరుతలు. కానీ బాబ్ క్యాట్, జంగిల్ క్యాట్, ఎడారి పిల్లి వంటి చిన్న పిల్లులు కూడా చాలానే ఉన్నాయి. మచ్చల పిల్లులు ప్రత్యేకమైనవి, చిన్నవి.
రెడ్ పాండాలు తూర్పు హిమాలయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చిన్న, అందమైన జీవులు.. వీటిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి మాంసాహారులు, మొదట మొక్కలను తింటాయి. ఇందులో ముఖ్యంగా ఇవి తినేది వెదురు ఆకులను. దీని తరువాత పండ్లు, పువ్వులు, కొన్ని సార్లు గుడ్లు లేదా చిన్న పక్షులను కూడా తింటాయి.