![India Vs Pakistan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/ind-vs-pak-t20wc.jpg)
India Vs Pakistan : ఇండియా, పాకిస్థాన్ మధ్య న్యూయార్క్ లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో మరి కొన్ని గంటల్లో ఉత్కంఠ పోరుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. ఇండియా, పాకిస్థాన్ రెండు టీం లు ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఈవెంట్లలో ఏడు సార్లు పాల్గొనగా.. ఇండియా ఆరు సార్లు, పాకిస్థాన్ ఒక్క సారి గెలిచాయి. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో ఆధిపత్యం ఇండియాదే.
ఇండియా ఈ టీ 20 వరల్డ్ కప్ లో ఇప్పటికే ఐర్లాండ్ తో మ్యాచ్ గెలిచి ఊపు మీద ఉంది. పాకిస్థాన్ మాత్రం పసికూన యూఎస్ఏపై ఓడి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్లోగా బ్యాటింగ్ చేయడం.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో పాక్ యూఎస్ఏపై ఓడింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా ఒక్కడే తక్కువ పరుగులు ఇవ్వగా.. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఈ మ్యాచ్ తో పాక్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 100 టీ20 మ్యాచ్ లు పూర్తి చేసుకోనుండగా.. ఇఫ్తికార్ అహ్మద్ 7 పరుగులు చేస్తే టీ 20 ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. పాక్ బౌలింగ్ విభాగానికి ఇండియా బ్యాటింగ్ కు మధ్య పోరు తప్పదనిపిస్తోంది. పాక్ నలుగురు పేసర్లతో ఆడనుండగా.. మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్, బాబర్ ఆజం బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది.
ఇండియా బ్యాటింగ్ లో సూర్య, శివమ్ దూబె ఎలా రాణిస్తారనే దానిపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. గత టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో విరాట్ కొహ్లి వీరోచిత ఇన్సింగ్స్ తో భారత్ ను గెలిపించాడు. మళ్లీ అలాంటి ఒత్తిడిలో కాకుండా పాకిస్థాన్ ను ఈజీగానే చిత్తు చేయొచ్చని అనుకుంటున్నారు. మరి కొన్ని గంటల్లో మ్యాచ్ జరగనుండగా.. కొన్ని కోట్ల మంది వేచి చూస్తున్నారు.