30.8 C
India
Friday, May 17, 2024
More

    AP Anganwadis : అంగన్వాడీలకు అండగా కమ్యూనిస్టులు.. రంగంలోకి సీపీఎం రాఘవులు

    Date:

    • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలు పునరావృతం కాబోతున్నాయా..? 
    AP Anganwadis
    AP Anganwadis, CPM Raghvalu

    AP Anganwadis : కమ్యూనిస్టులు ఎప్పుడూ ఉద్యమకారులే.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రోడ్డెక్కారు. పెట్రోల్ ధరలు, నిత్యావసరాల పెంపుపై కమ్యూనిస్టులు చేసినటువంటి వినూత్న ఆందోళనలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయలేదు. ఎడ్లబండిపై ర్యాలీలు, వాహనాలను లాక్కెళ్లడం లాంటివి అప్పట్లో ప్రజలను ఆకర్షించాయి. ఉద్యమాల్లో పాల్గొనేలా చేశాయి.

    ఇప్పుడు కూడా మళ్లీ కమ్యూనిస్టులు మళ్లీ అలాంటి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఏపీలో అంగన్ వాడీలకు మద్దతుగా కమ్యూనిస్టు పార్టీ నేత రాఘవులు రంగంలోకి దిగారు. వారి వెంట ఉంటూ ఉద్యమిస్తున్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు.

    కమ్యూనిస్టుల పోరాటానికి నాడు చంద్రబాబు తలవంచారు. రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా బషీర్ బాగ్ లో ఉద్యమించిన కమ్యూనిస్టులు, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు చంద్రబాబు ప్రభుత్వం. అంతటితో ఆగకుండా ఉద్యమించిన రైతులు, కమ్యూనిస్టులపై కాల్పులు జరిపించారు. అంతటి పోరాటం కమ్యూనిస్టుల సొంతం..

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  నాటి ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవ డానికి ప్రపంచ బ్యాంక్ విధించిన షరతుల ప్రకారం విద్యుత్ బిల్లులు పెంచారు. నాటి సీపీఎం నాయ కుడు BV రాఘవులు నాయ కత్వంలో తీవ్రంగా ప్రతిఘటించారు. పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గిం చనంత వరకు అసెంబ్లీ స్తంభింప జేస్తాం అని ప్రకటించి , ప్రజలకు పిలుపు ఇచ్చారు. ముందు జాగ్రత్తగా కామ్రేడ్ స్ ను హౌస్ అరెస్ట్ చేసి అసెంబ్లీ దగ్గర పోలీసులను మోహరించారు. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి అజ్ఞా తం లోకి వెళ్ళి రిక్షా కార్మికులు గా డ్రెస్ మార్చుకుని పోలీసులను ఎమార్చి బషీర్బాగు చేరుకున్నారు. ముందుండి పార్టీ శ్రేణులను నడిపించారు.

    అప్పటివరకు ఎక్కడెక్కడో ఒకరిద్దరుగా వున్న కార్య కర్తలు ఉప్పెనగా దూసుకొచ్చి అసెంబ్లీ వైపు బారికేడ్లను ధ్వంసం చేస్తూ – అసెంబ్లీ గేటు వైపు కదిలారు. వారిని నిలువరించడానికి పోలీసులు తమదైన పద్ధతిలో  అన్ని ప్రయత్నాలు చేసినా నిరసన ర్యాలీ కట్టడి కాకపోవడంతో ఫైరింగ్ చేశారు; కామ్రేడ్ స్ నేలకొరిగారు. ఉద్యమం ఊపందకోవడంతో చంద్రబాబు అప్రదిష్ట పాలయ్యారు.

    ఇప్పుడు అదే రాఘవులు అంగన్వాడీకార్యకర్తలకు అండగా రంగ ప్రవేశం చేశారు. ఉభయ రాష్ట్రాల కమ్యునిస్ట్ అగ్ర నాయకులు ముందుండి ఉద్యమి స్తారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని వర్గాలు సమ్మెబాట పట్టారు; ఒక్క రైతు మాత్రమే సంయ మనం పాటించి వేచి చూస్తున్నారు. అగ్గి రాజు కుంది. అగ్గిపుల్ల తల చిన్నదే కానీ నిప్పు రవ్వను రగిలిస్తుంది; కార్చిచ్చు గా వ్యాపిస్తుంది. సీపీఎం రాఘవులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు.

    — తోటకూర రఘు, ఆంధ్ర జ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...