33.2 C
India
Sunday, May 19, 2024
More

    Difference between Jagan & Chandrababu : చంద్రబాబుకు, తనకు మధ్య తేడా చెప్పిన జగన్

    Date:

    Difference between Jagan & Chandrababu
    Difference between Jagan & Chandrababu

    Difference between Jagan & Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు మరింత జఠిలంగా మారుతున్నాయి. ‘స్కిల్ డెవలప్ మెంట్’ స్కాంలో చంద్రబాబు నాయుడు 40 రోజులుకు పైగా రిమాండ్ ఖైదీగా జైల్లో గడుపుతున్నారు. ఆయనకు ఇప్పట్లో బెయిల్ దొరికేలా కనిపించం లేదు. సీబీఐ కోర్టు, ఏపీ హై కోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లో ఆయనకు చుక్కే ఎదురవుతుంది. సుప్రీ కోర్టు లాయర్లను పెట్టుకున్నా కూడా బెయిల్ లభించడం లేదు. ఈ కేసు వీక్ అవుతుందని అనుమానం వస్తే మరో కేస్ పెడుతుంది వైసీపీ ప్రభుత్వం. బయట ఉన్న ఆయన కొడుకు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ పై కూడా కేసులు మోపుతూ ఆయనను కూడా జైలులో వేయాలని చూస్తుందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.

    ఈ నేపథ్యంలో వైసీపీ నేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఈ నెల (అక్టోబర్) 9వ తేదీన జరిగిన వైసీపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఈ సమావేశంలో చంద్రబాబు గురించి ఆయన మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోపం తెప్పించిందని టాక్ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా కాకున్నా.. కనీసం తండ్రి ఫ్రెండ్ లా, లేక సీనియర్ నాయకుడిగా నైనా గుర్తించాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన ఉంచితే చంద్రబాబు నాయడు, జగన్ పాలనలో తేడాలను ఆయన వివరించారు.

    చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పాలన మధ్య తేడాను జగన్ ఒక సందర్భంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలననలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే అమరావతి భూముల వరకు అన్నీ స్కాములే జరిగాయని ఆరోపించారు. ‘స్కిల్ స్కాం’ ఫైబర్ నెట్, మద్యం కొనుగోళ్లలో ఎక్కడ పడితే అక్కడ స్కాం చేసి దోచేయడం.., దోచుకోవడం.., దోచుకున్నది పంచుకోవడం.., పంచుకున్నది తినుకోవడం. ఇవి తప్ప రాష్ట్రంలో ఏమీ కనిపించలేదన్నారు. కానీ నాలుగేళ్లలో రూ. 2.38 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో తమ ప్రభుత్వం జమచేసిందని జగన్ వ్యాఖ్యానించారు.

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...