28 C
India
Friday, May 17, 2024
More

    ISRO Scientists Salary: ఇస్రో శాస్త్రవేత్తల వేతనం ఎంతో తెలుసా?

    Date:

    isro
    isro

    ISRO Scientists Salary:

    భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో ఎంతో ఖ్యాతి ఆర్జించింది. ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై కాలు మోపనుంది. దీంతో దేశం యావత్తు ఇస్రో వైపు చూస్తోంది. చంద్రయాన్ 3 విజయవంతం కావాలని పలువురు హోమాలు నిర్వహిస్తున్నారు. జులై 14న చంద్రయాన్ 3 శ్రీహరి కోట నుంచి ఇస్రో ప్రయోగించింది. మరికొన్ని గంటల్లో చంద్రయాన్ 3 ల్యాండ్ కానుంది. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని అందరు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

    చంద్రయాన్ ప్రాజెక్టు కోసం ఇస్రో శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా శ్రమిస్తున్నారు. అంతరిక్ష రంగంలో శాస్త్రవేత్తలు చేస్తున్న దానికి ఇప్పుడు సరైన గుర్తింపు దక్కనుంది. అంతరిక్ష రంగంలో భారత్ గర్వపడేలా ఇస్రో శాస్త్రవేత్తలకు అందుతున్న వేతనం ఎంతో తెలుసా? వారికి అందే పారితోషికం గురించి నెట్లో వెతుకుతున్నారు. వారి జీతభత్యాల గురించి తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

    ఇస్రో శాస్త్రవేత్తలకు నెలకు రూ. 15,600 నుంచి రూ. 39,100 నుంచి 80,000 వరకు అందుతుంది. వారి విద్యార్హతల ఆధారంగా వేతనం చెల్లించడం జరుగుతుంది. వారు పనిచేస్తున్న ప్రాంతం కూడా లెక్కలోకి తీసుకుంటారు. అంతరిక్ష సంస్థ ఇస్రో ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్లను నియమించుకుంటుంది. ఏడో వేతన సవరణ తరువాత ఇస్రో శాస్త్రవేత్తల వేతనాలు సవరించారు.

    శాస్త్రవేత్తలకు అలవెన్సులు, ప్రత్యేక అలవెన్సులతో పాటు డీఏ, హెచ్ ఆర్ఏ, ట్రాన్స్ పోర్ట్ అలవెన్సులు ఉంటాయి. ఇస్రోలో ఒక శాస్త్రవేత్తకు ఇచ్చే వేతనంతో అతడి జీవితానికి భద్రత, ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. ప్రతి నెల 10 నుంచి 30 శాతం వరకు డీఏ ఉంటుంది. హెచ్ ఆర్ఏ కూడా అందుకు అనుగుణంగా ఉంటుంది. ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ రూ. 400 నుంచి రూ. 3200 వరకు గ్రేడ్ పే ఆధారంగా చెల్లిస్తారు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Offer-Appointment : ఆఫర్.. అపాయింట్‌మెంట్ వీటి మధ్య కనిపించనంత సన్నటి గీత.. ఎలా గుర్తించాలో తెలుసా?

    Offer-Appointment : ఒకప్పుడు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిందంటే చాలు...

    Telangana : GOOD NEWS చెప్పిన ఫ్రభుత్వం

    Telangana : రెవెన్యూ శాఖలో పనిచేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనమైన...

    Software Company Turned The Board : నిరుద్యోగుల ఆశలపై కంపెనీల నీళ్లు.. జీతాలివ్వక వేధింపులు..

    Software Company Turned The Board : ప్రస్తుత కాలంలో ఉద్యోగమనేది...