27.8 C
India
Thursday, May 2, 2024
More

    Software Company Turned The Board : నిరుద్యోగుల ఆశలపై కంపెనీల నీళ్లు.. జీతాలివ్వక వేధింపులు..

    Date:

    Software Company Turned The Board :

    ప్రస్తుత కాలంలో ఉద్యోగమనేది అందరికీ అవసరం. చదువులు పూర్తయి అర్హతకు తగ్గ జాబ్ లభించక ఎంతో మంది వేదనకు లోనవుతున్నారు. ఇలాంటి వారు ఉన్నదేదో చేసుకొని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. మరికొందరు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికే వారి చేతుల్లో పడి మోసపోతున్నారు. జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. తర్వాత జరిగిన మోసం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. ఇటీవల ఇలాంటి మోసగాళ్ల ఆగడాలు మరింత పెరిగాయి. నిరుద్యోగుల ఆశలు.. అవసరాలు ఆసరాగా చేసుకొని వీరంతా రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది.

    సాఫ్ట్ వేర్ ఉద్యోగమని ఊరుకాని ఊరుకు వచ్చి అలా మోసపోయారు కొందరు. మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు. ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన బిజినెపల్లి ప్రేమ్ ప్రకాశ్ సనత్ నగర్లో ఉంటున్నాడు. స్నేహితుడు లిఖిత్ తో కలిసి కొండాపూర్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించాడు. వెస్ర్టన్ పేరల్ భవన్ లో సంతూస్ ఇన్నోవేషన్ పేరిట ఐటీ కంపెనీ మొదలుపెట్టాడు. ఒక్కో నిరుద్యోగి నుంచి లక్ష నుంచి రెండు లక్షల దాకా వసూలు చేసి ఉద్యోగాలిచ్చారు. ఆ తర్వాత రెండు నెలలు వేతనాలు మంచిగానే ఇచ్చారు. ఇక జీతాలివ్వడం మానేశారు.

    దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమ కు జరిగిన అన్యాయంపై గోడు వెళ్లబోసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై పెరుగుతున్న మక్కువను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు ఇలా అందినకాడికి దోచుకుంటున్నారు. తమ భవిష్యత్ పై ఆశలతో ఇలా బయలుదేరిన నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు మిన్నుకుండిపోతున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారికి కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప, ఇలాంటి వాటికి చెక్ పడదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : GOOD NEWS చెప్పిన ఫ్రభుత్వం

    Telangana : రెవెన్యూ శాఖలో పనిచేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనమైన...

    ISRO Scientists Salary: ఇస్రో శాస్త్రవేత్తల వేతనం ఎంతో తెలుసా?

    ISRO Scientists Salary: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో ఎంతో...

    AP : ఉద్యోగుల పై మారిన జగన్ వైఖరి.. ఎన్నికల వేళ సాఫ్ట్ మోడ్..

    AP : ఏపీలో కొంతకాలంగా ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ...

    Resign : ఇలా కూడా రాజీనామా చేస్తారా నాయనా?

    Resign రిజైన్ లెటర్ అంటే ఏం ఊహించుకుంటాం! జీతం సరిగాలేకనో.. కొలిగ్స్...