31 C
India
Monday, May 20, 2024
More

    Chandrayaan 3 : పురాణాల ప్రకారం చంద్రుడు ఎవరో తెలుసా?

    Date:

    Moon
    Moon

    Chandrayaan 3 :  ప్రస్తుతం చందమామపై ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు అందరి కన్ను చంద్రుడిపై పడుతోంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా చంద్రుడిపై ప్రయోగాలు చేయడంతో ఇండియా కూడా చంద్రయాన్ -3 విజయవంతంగా ప్రయోగించడంతో ప్రపంచం యావత్తు చందమామ గురించి మాట్లాడుకున్నారు. చందమామపై మన పురాణాలు పలు కథలు ప్రచురించింది.

    ఈ నేపథ్యంలో చందమామపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పురాణాల్లో చందమామను సోమ అని పిలిచేవారట. వేదాల్లో కూడా చంద్రుడికి ప్రత్యేక స్థానమే ఉంది. ఇంకా శశి, ఇందు, అత్తిసుత, విశాకర, ఓషధీపతి, తారాధిప అనే పేర్లు ఉన్నాయి. సోమ అనే పేరు వేదాల్లోనే ఉంది. సోమ అంటే మత్తు కలిగించేది అని అర్థం. వేద కాలంలో ఇటువంటి సోమ రసాన్ని తయారు చేసుకుని తాగేవారని చెబుతారు.

    ఔషధాలకు కారకుడు చంద్రుడు. చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ఒక తల్లికి పుట్టిన సోదరులు. వీరు అత్రి మహామునికి అనసూయకు పుట్టిన వారని పురాణాలు చెబుతున్నాయి. దేవి భాగవతం చంద్రుడు బ్రహ్మదేవుడి అంశ అని చెబుతోంది. చంద్రుడు ధర్మదేవతకు పుట్టిన కుమారుడని అంటారు. చంద్రుడి తండ్రి పేరు ప్రభాకరుడు. దేవతల గురువు భార్యను చంద్రుడు ప్రేమించాడు.

    చంద్రుడు ఆమెను అపహరించుకుపోయి తన రాణిని చేసుకున్నాడు. వారికి బుధుడు అనే కొడుకు పుట్టడం, అతడు ఎవరనే దానిపై వివాదం జరిగింది. చివరకు బ్రహ్మదేవుడు వచ్చి ఆ పిల్లవాడు చంద్రుడి కుమారుడనే తేల్చడం పురాణాల్లో ఒక కథ ఉంది. దక్షప్రజాపతికి 27 మంది కుమార్తెలుండగా వారిని చంద్రుడు వివాహం చేసుకున్నట్లు పురాణాల్లో మరో కథ కూడా ఉంది.

    అవే 27 నక్షత్రాలుగా చంద్రుడితోనే ఉంటాయి. ఇందులో రోహిణి నక్షత్రమంటే చంద్రుడికి బాగా ఇష్టమట. శివుడి శిరస్సును అలంకరించిన శశిగా పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడి కాంతి మీద ఆధారపడి చంద్రుడు పదిహేను రోజులు కాంతివంతంగా పదిహేను రోజులు చీకటిగా కనిపించడం జరుగుతుంది. పార్వతీ దేవి శాపం వల్ల చంద్రుడికి ఈ కళ్ల కలకలు ఏర్పడ్డాయని అంటారు. చంద్రుడి పేరు మీదే సోమవారం ఏర్పడిందని అంటారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Moon : చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఒక వింత వస్తువు.. అదేంటంటే?

    Moon : ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విడ్డూరాలు నిత్యం...

    Moon : చంద్రుడిపై ధ్వని ఎందుకు వినిపించదో తెలుసా?

    Moon : మనిషి తన తెలివితేటలతో ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు. చంద్రుడిపై కాలు...

    Italy : చంద్రుడే గొడుగైనవేల : ఇటలీలో అద్భుతమైన దృశ్యం!

    Italy : ఇటలీకి చెందిన వలేరియా మి నాటో అనే వ్యక్తి ఓ...

    Mission Gaganyaan : ‘గగన్‌ యాన్’ స్టార్ట్ అయిన కాసేపటికే మంటలు.. అసలు ఏమైంది..?

    Mission Gaganyaan : చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మరో మార్స్...