Moon : మనిషి తన తెలివితేటలతో ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు. చంద్రుడిపై కాలు మోపాడు. ఇలా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. తన మేథస్సుతో ఎన్నో వింతలు, విశేషాలు కనుగొంటున్నాడు. చంద్రుడిపై కాలు పెట్టినా అక్కడ వాతావరణం మనకు అనుకూలంగా లేదు. ఎందుకంటే అక్కడ గాలి ఉండదు కాబట్టి మనకు ఏదీ వినబడదు. మనం ఏం చేసినా మనకు శబ్దం రాదు.
ఇక మీదట అక్కడ కూడా నివాసం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలని ఎత్తుల వేస్తున్నాడు. అక్కడ కూడా గాలిని పుట్టించి మానవుడికి అనువుగా వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని పథకాలు వేస్తున్నాడు. భవిష్యత్ లో చంద్రమండలం మీద సెటిల్ అవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాడు.
చంద్రుడి మీద గాలి ఎందుకు ఉండదు? దానికి కారణాలంటని తెలుసుకుంటే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. భూమిపై ఒకరి గొంతును మరొకరు వినగలం. గాలి కారణంగా మన నోటి నుంచి వచ్చే ధ్వని ఇతరులకు వినిపించడం మామూలే. అది మన చెవులకు వినిపిస్తుంది. ధ్వని తరంగాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తాయి.
ధ్వని కంపనం నుంచి పుడుతుంది. ప్రతి ధ్వని కంపనం ద్వారా ఉత్పత్తి చేయవలసిన అవరసం లేదు. ధ్వని చేరవేయాలంటే ఒక మాధ్యమం ఉండాలి. అది చంద్రుడిపై లేదు. అందుకే శబ్దం ఒక మనిషి నుంచి మరొక మనిషికి రాకపోవడానికి కారణం అదే. అందుకే అక్కడ కూడా గాలి వచ్చేలా ఏర్పాట్లు మానవ నివాసానికి అనువుగా తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారు.