36.5 C
India
Friday, April 10, 2026
More

    ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. ఈమె తల్లి కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్..

    Date:

     

    keerthy suresh

    ఇండస్ట్రీలో వారసత్వం కామనే. హీరోలు వారి లెగసీ చూపించేందుకు కొడుకులను ఇండస్ట్రీకి తెస్తే, తామేం తక్కువ తిన్నామా అంటూ హీరోయిన్లు కూడా తమ కూతుళ్లును రంగుల ప్రపంచలో స్టార్ హీరోయిన్లుగా నిలబెడుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ ఏ చిత్ర పరిశ్రమ అయినా వారసత్వం కామనే. తాము చిన్నప్పటి నుంచి చూసిన లైటింగ్, కెమెరాలు, దర్శకులు ఇలా చాలా ముందుగానే తెలియడంతో యాక్టింగ్ వారికి ఈజీ అయిపోతుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని కుదిపేసిన తారల కూతుళ్లు ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు.

    ఇక్కడున్న ఫొటోలోని చిన్నారి ఎవరో తెలిస్తే ఆమె తల్లి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫొటోలో ఉన్న చిన్నది కీర్తి సురేశ్. అవునండీ నమ్మండి ఇది నిజమే. కీర్తి సురేష్ గురించి తెలుసుకుంటే ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలోనే బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ‘నేను శైలజ’తో టాలీవుడ్ లో పాదం మోపిన కీర్తి సురేశ్ ఫస్ట్ మూవీతోనే నటనలో కట్టిపడేసింది. తన తర్వాతి చిత్రం ‘మహానటి’. అలనాటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాలో అచ్చం సావిత్రిలా నటించి చాలా అవార్డులను అందుకుంది. తర్వాత అంతగా ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఆమెకు లభించలేదు. రీసెంట్ గా నానితో ‘దసరా’ తీసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెన్నెలగా కనిపిస్తుంది కీర్తి సురేశ్.

    కీర్తి సురేశ్ తల్లి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె తల్లి పేరు మేనకా సురేష్ కుమార్. ఒకప్పుడు ఆమెకూడా స్టార్ హీరోయినే. తమిళనాడులోని, కన్యాకుమారి, నాగర్ కోయిల్ లో 1963లో జన్మించింది మేనక. అమె అసలు పేరు పద్మావతి. ‘రమాయి వయసుకు వంతుట్ట’ సినిమాతో 1980తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆరు సంవత్సరాలలోనే తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం తదితర భాషలతో కలుపుకొని దాదాపు 116 చిత్రాల్లో నటించారు. చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన ‘పున్నమినాగు’ సినిమాలో మేనక హీరోయిన్ గా నటించారు. నిర్మాత సురేశ్ కుమార్ ను వివాహం చేసుకున్న ఆమె ఇండస్ట్రీని వీడి వైవాహిక జీవితంలో కొనసాగారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా చిన్న కూతురు కీర్తి సురేశ్.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrunal :మరోసారి ర్యాంప్ వాక్ తో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

    Mrunal :సౌత్‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ రాణిస్తున్నది మృణాల్ ఠాకూర్. తన...

    Star heroine : పెళ్లయి 12ఏళ్ల తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

    star heroine Radhika Apte : బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు...

    Star heroine : రెండో బిడ్డ ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్

    Star heroine Pranitha : తెలుగు చిత్ర పరిశ్రమలో నటి ప్రణీత...

    Star Heroine Injured : షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన స్టార్‌ హీరోయిన్‌.. ఎలా జరిగిందంటే?

    Star Heroine Injured : నటి ప్రియాంక చోప్రా గాయపడింది. ఆమె...