35.6 C
India
Tuesday, May 14, 2024
More

    Salute To Mothers Hard Work : తల్లి వీపుపై తనయుడు.. ఈ తల్లి కష్టానికి సెల్యూట్ చేయాల్సిందే.. వైరల్ వీడియో

    Date:

    Salute To Mothers Hard Work
    Salute To Mothers Hard Work

    Salute To Mothers Hard Work : మనకు కనిపించే ప్రత్యక్ష దైవం తల్లి. తండ్రి అవసరాలు తీరుస్తాడు. తల్లిదండ్రుల సేవలోనే పిల్లలు పెరిగి పెద్దవుతారు. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదని అంటారు. పిల్లలకు ఎల్లవేళలా తోడుండేది మాత్రం అమ్మే. తండ్రి సంపాదిస్తాడు. తల్లి తిండిపెడుతుంది. ఇలా వారి సంరక్షణలో పిల్లలకు నీడ దొరుకుతుంది. ఇందులో ఎవరి ప్రేమ లేకున్నా కష్టమే.

    నవమాసాలు మోసి కంటుంది అమ్మ. తన బిడ్డ కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. పురిటి నొప్పులు పునర్జన్మతో సమానమని తెలిసినా అందులో కూడా తన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటుంది. అందుకే  చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు. తల్లి ప్రేమలో కల్మషం ఉండదు. స్వార్థం అసలే ఉండదు. అలాంటి తల్లి పాత్ర ప్రతి  ఒక్కరి జీవితంలో ముఖ్యమే.

    బిడ్డ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వీడియోలో సరిగా నిలబడలేని తల్లి తన బిడ్డ కోసం కర్రల సాయంతో ఏనుగులా మారడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. తన కొడుకు కోసం ఆమె ఆ పాత్ర ధరించడం కోసం సిద్ధమైంది. ఈ విషయం ఆ కుర్రాడికి పెద్దగా తెలియదు. తన అమ్మ ఇంత కష్టపడుతుందని అతడికి ఆలోచన ఉండదు. కానీ అతడి కోరిక మేరకు వీపుపై బాలుడిని ఉంచుకుని ఆమె పడుతున్న తపన చూసి అక్కడున్న వారందరు వేదనకు గురయ్యారు.

    దివ్యాంగురాలైన తన సంతానం కోసం ఆమె పడుతున్న కష్టం అక్కడున్న వారిని కదిలించింది. మనసున్న వారందరు ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. తల్లి పడే వేదన చూసి తమ కడుపు తరుక్కుపోయేలా బాధపడ్డారు. పేదరికం నరకమే. కానీ అందులోనే చాలా మంది జీవిస్తుంటారు. చాలీ చాలని సంపాదనతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కాలం వారికిచ్చిన శాపం. ఏం చేద్దాం వారి జీవితాలు అంతే.

    Share post:

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Superiority of Women Survival : స్త్రీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటేనే మనుగడ..!

    Superiority of Women Survival : స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో...

    Mother : ఇదేం పని తల్లీ..

    పాప ఏడుస్తుందని పాలకు బదులు మద్యం పట్టించిన మహిళ అనారోగ్యానిక గురైన నెలన్నర...

    Mother Father : నాన్న.. నీ మనసు వెన్న

    Mother Father : అమ్మ జన్మనిస్తుంది. నాన్న ప్రేమనిస్తాడు. మన జీవితం...