Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో అక్షరాల మార్పు ద్వారా కూడా తమ లక్ ఫ్యాక్టర్ పెరుగుతుందని, తమ జీవితం కూడా అనూహ్యంగా మారుతుందని నమ్ముతారు. దీనికి సంబంధించిన నిపుణులు కూడా ఉంటారు. ఏ పేరు పెట్టుకోవాలి..పేరులో ఏ అక్షరం చేర్చుకోవాలి..ఏ అక్షరం తొలగించాలి..ఇలా మన జ్యోతిష్యాన్ని బట్టి మన పేరును వారు డిసైడ్ చేస్తారు. ఇలాంటివి సినిమా తారలు ఎక్కువగా నమ్ముతారు. దాని ప్రకారం పేర్లు సైతం మార్చుకోవడమే కాదు..ఉన్న పేరులో అక్షరాలను తొలగించడం, చేర్చడం చేస్తుంటారు.
అయితే తాజాగా మళ్లీ మెగా మేనల్లుడు సాయ్ తేజ్ తన పేరును మార్చుకున్నారు. అయితే ‘వాస్తు’ కోసం కాదండి.. తమ అమ్మపై ఉన్న ప్రేమతో ఆమె పేరును కూడా తన పేరులో చేర్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ చిరు అల్లుడిగా సినీ రంగప్రవేశం చేసిన తనకంటూ సొంత ఇమేజ్ తో ముందుకెళ్తున్నారు. ఆ మధ్య యాక్సిడెంట్ అయిన తర్వాత తన పేరులో ఉన్న ధరమ్ నుంచి పక్కకు తప్పించి సాయి తేజగా చలామణి అవుతున్నారు. తాజాగా తన పేరులో మరో కొత్త పదాన్ని యాడ్ చేసుకున్నారు. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సాయితేజ, స్వాతి కలిసి చేసిన ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్ ను మీడియా ప్రతినిధులకు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు మేకర్స్..
ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన పేరులో ఒక చిన్న మార్పు జరిగిందని చెబుతూ తన పేరులో తల్లి దుర్గ పేరును యాడ్ చేసుకున్నానని వెల్లడించారు. తన తండ్రి పేరు ఎలాగో ఇంటి పేరుతో తనకు సంక్రమిస్తుంది.. కానీ తల్లిని దూరం చేసుకోవాలనే ఉద్దేశం లేకపోవడంతో తన తల్లి దుర్గ పేరును తన పేరుతో యాడ్ చేసుకుంటున్నానని తెలిపారు. గతంలో ఈ సత్య అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయగా దానికి మంచి ఆదరణ లభించింది. సీనియర్ నరేశ్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు.