పాప ఏడుస్తుందని పాలకు బదులు మద్యం పట్టించిన మహిళ
అనారోగ్యానిక గురైన నెలన్నర చిన్నారి
Mother పిల్లల నోటి నుంచి వచ్చే మొదటి పదం అమ్మ. పొత్తిళ్లలో తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది తల్లి. తమ పిల్లలకు ఏ చిన్న ఆపద వచ్చినా విలవిలలాడిపోతుంది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి బిడ్డ ఏడుపు ఆపడానికి చేసిన పనికి అందరూ విస్తుపోతున్నారు. పసి బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలు పట్టి పాపను నిద్రపుచ్చుతుంది తల్లి. కానీ ఓ తల్లి తన బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాల డబ్బాలో మద్యం నింపి పాపాయికి తాగించింది.
నెలన్నర బిడ్డకు పాలకు బదులు మందు పట్టించిన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. హోనెస్టి డి లా టోర్రే అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. అక్కడి పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హోనెస్టి డి లా టోర్రే అనే మహిళకు నెలన్నర బిడ్డ ఉన్నది. తన పాపతో కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా పాప గుక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టింది. దీంతో అసహనానికి గురైన ఆ తల్లి పాల డబ్బాలో ఆల్కాహాల్ నింపి పాపకు పట్టించింది.
దానిని తాగిన తర్వాత ఆ చిన్నారి మత్తులోకి జారుకుని అనారోగ్యానికి గురైంది. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా తల్లి పాప ఏడుపు ఆపడం కోసం పసి బిడ్డకు మందు పట్టించిన విషయం తెలుసుకోని షాక్ అయ్యారు. పాప ఆరోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరించిన హోనెస్టి డి లా టోర్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.