31 C
India
Monday, April 29, 2024
More

    Alcohol : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే మందు మానేయండి లేదంటే?

    Date:

    Are these symptoms present
    Are these symptoms present??

    Alcohol : మద్యం అనేది ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే కానీ.. చాలా మంది తీసుకోకుండా ఉండలేరు. సోషల్ డ్రింకర్ అయితే కొంచెం వరకు పర్వాలేదు. కానీ బానిసగా మారితేనే కష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సోషల్ డ్రింకర్ గా కాకుండా కొందరు ప్రతి రోజూ మద్యం తాగేందుకు ఇష్టపడతారు. మద్యం లేనిది వారు ఉండలేదు. ఉదయం వైన్స్ షెట్టర్ తీయడం ఆలస్యం కావచ్చని నిత్యం మందు బాటిళ్లను ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు కొందరు ప్రబుద్ధులు.

    ఇలా చాలా మంది మందుకు బానిసలుగా మారుతుంటారు. కొందరు కొద్ది మొత్తంలో తీసుకుంటే మరికొందరు మాత్రం సీసాలకు సీసాలు గుంజి పారేస్తుంటారు. అరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నా వాటిని పట్టించుకోరు. పైగా దూరం కాలేకపోతున్నామని ఎలా తాగాలని వైద్యులనే అడుగుతారు. దీంతో పాటు కొన్ని అధ్యయనాల్లో మధ్యంతో ప్రమాదకర సమస్యలు ఎదురవుతాయని రుజువైంది.

    అయినా చాలా మంది భయపడకుండా ఉంటారు. నీళ్లు తాగినట్లుగా మద్యం తాగుతున్నారు. అయితే మందు అలవాటు ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత వేగంగా మందు మానేయాలట. లేదంటే అత్యంత భయానకమైన ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

    * ఉదయం నిద్రలేవగానే మగతగా.. నీరసంగా ఉంటే మద్యానికి దూరంగా ఉండాట.
    * మద్యం వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీంతో చిన్న అనారోగ్యం కూడా పెను ముప్పునకు దారి తీస్తుంది. కాబట్టి మద్యం మానేయాలి.
    * దగ్గు, కడుపులో ఉబ్బరంగా అనిపిస్తే మద్యం వల్లే అని గుర్తించాలి.
    * శరీరంపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మద్యాన్ని పూర్తిగా మానేయాలి. ఈ లక్షణం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
    * దంతాలు, చిగుళ్ల సమస్యలు ఏర్పడితే మద్యం వల్లే అని గ్రహించి డాక్టర్లను సంప్రదించాలి. వారి సూచనలు పాటించాలి.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : మద్యం షాపులపై ఆంక్షలు సరే..మరి బ్లాక్ మార్కెట్?

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు జగన్...

    Alcohol : మందులో ఎంత వాటర్ కలపాలో తెలుసా? 99.9 శాతం మంది చేసేది తప్పేనట!

    Alcohol : మందు బాబులకు అత్యంత ఎక్కువ ఇష్టమైనది ‘విస్కీ’. ఎందుకంటే...

    Oversleeping : ఎక్కువగా నిద్రపోతున్నారా? ఈ వ్యాధులు రావచ్చేమో జాగ్రత్త!

    Oversleeping : ప్రతీ జీవి జీవక్రియలు సాగేందుకు ప్రకృతి నియమాలు విధించింది....

    Alcohol Prices : ఏ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయో తెలుసా?

    Alcohol Prices : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్...