Oversleeping : ప్రతీ జీవి జీవక్రియలు సాగేందుకు ప్రకృతి నియమాలు విధించింది. ఇది అందరికీ తెలిసిందే కదా.. భూమిపై ఉన్న జీవకోటి ఆ నియమాలకు బద్ధులుగా జీవనం సాగిస్తుంటే పాపం మనిషి అనే జీవి మాత్రం వాటిని కాలరాస్తుంటాడు. ప్లాస్టిక్ అనే ఒక ఉత్పత్తిని కనిపెట్టి సమస్త జీవకోటికి చేటు చేసేందుకు యత్నించాడు. ఇది అత్యంత ప్రమాదం అని తెలుకొని కొంచెం కొంచెం మార్పు తీసుకస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే..
జంతువుల జీవక్రియల విషయంలో ప్రకృతి కొన్ని నిబంధనలు విధించింది. కొన్ని జీవులు ఉదయం (సూర్యుడు ఉన్నప్పుడు) మెలకువతో ఉంటాయి. మరికొన్ని రాత్రి (సూర్యుడు అస్తమయం తర్వాత) మెలకువతో ఉంటాయి. ఇవి రోజు వారి పనులు, వేట లాంటివి చేసుకుంటాయి. ఇక వీటిలో జీవక్రియలు కూడా సూర్యుడిపై ఆధారపడి ఉంటాయి. గబ్బిలం, గుడ్లగూబ లాంటి జంతువులు రాత్రి మాత్రమే బయటకు వస్తాయి. ఉదయం చెట్లకు వేలాడుతూ నిద్రలో ఉంటాయి.
మనిషికి కూడా నిబంధనలు ఉంటాయి. ఉదయం (సూర్యుడు ఉన్న సమయం) పనులు చేసుకోవాలి. దానిపైనే శారీరక జీవన క్రియలు ఆధారపడుతాయి. రాత్రి నిద్రించాలి. కానీ ఒత్తిడి ప్రపంచం, డబ్బు కాంక్షలో పడి రాత్రి, పగలు అనే తేడా లేకుండా పోయింది. తక్కువ నిద్రపోతే ఎంత ప్రమాదమో ఎక్కువగా నిద్రపోతే కూడా అంతే ప్రమాదం. ఎక్కువ సేపు నిద్రపోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి 9 గంటల కన్నా ఎక్కువగా నిద్రపోతే శరీరంలో చాలా మార్పులు వస్తాయట. 10 గంటలు నిద్రపోయే వారు ఎక్కువగా నీరంగా ఉంటారట. అతి నిద్ర అనేది మద్యం, సిగరేట్ తాగడం కన్నా ఎక్కువ ప్రమాదం.. అలాగే ఎక్కువ సేపు నిద్రపోయే వారు తలనొప్పి, వెన్నునొప్పి, స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటి సమస్యలను ఎదుర్కొంటారట. అందుకే అతి ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా నిర్ణీత సమయం మాత్రమే నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు.