Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా ఒకటి. ఆహారం తినకుండా కొంత కాలం బతకవచ్చేమో గానీ నిద్ర పోకుండా బతకడం అసాధ్యం. నిద్ర బెడ్ పైకి వెళ్లి పడుకోవడం కాదు. ఏ వైపు తిరిగి పడుకుంటే ఏం ఇబ్బందులు వస్తాయోనని తెలుసుకోవాలి.
వెల్లకిలా, బోర్లా, కుడి వైపునకు, ఎడమ వైపునకు. ఇలా నాలుగు విధాలుగా పడుకోవచ్చు. ఒక్కో విధానంలో పడుకుంటే శరీరం ఒక్కో విధంగా స్పందిస్తుంది. ఇన్ని దిక్కులు ఉన్నా అసలు ఏ వైపుకు పడుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు, సలహాలు చేస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కుడి వైపునకు తిరిగి పడుకోవడం కంటే ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట.
ఎడమ వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల జీర్ణక్రియకు ఎలాంటి ఇబ్బంది ఉండదట. ఈ ప్రక్రియకు ఆటంకం కలగకుండా సులభతరం జరుగుతుందట.
ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల మలాశయంపై ఒత్తిడి తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో ఇది బాగా సహాయపడుతుందట.
ఎడమ వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల గుండెకు సైతం రక్త ప్రసరణ బాగా జరిగి గుండె సాఫీగా కొట్టుకుంటుందట.
గర్భిణులు ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల గర్భంలో ఉన్న పిండానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట.
కుడి వైపునకు తిరిగి పడుకుంటే గురక శబ్ధం తక్కువగా వస్తుందట. మెడ నొప్పి కూడా తగ్గుతుందట.
మెడకు మద్దతుగా ఒక చిన్న దిండును ఉపయోగించాలి. కానీ మరీ ఎత్తుగా ఉండేవి ఉపయోగించవద్దు. కాళ్ల మధ్య ఒక దిండు ఉంచడం వల్ల వెన్నెముకకు మద్దతు ఉంటుంది.