31 C
India
Monday, May 20, 2024
More

    Does BJP Promote Family Politics? : బీజేపీ ఫ్యామిలీ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తుందా..!

    Date:

    Does BJP Promote Family Politics?
    Does BJP Promote Family Politics?

    Does BJP Promote Family Politics? : వారసత్వ, కుటుంబ పాలన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో దాదాపుగా కనిపించదు. ఎక్కడో ఒకటి, రెండు చోట్ల అది కూడా పార్టీ విలువలమేరకే అంటూ చెప్తున్న బీజేపీలోకి ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంటరయ్యాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆ కుటుంబం గురించి దేశం అంటూ గాంధీ కుటుంబం వైపు వేలెత్తి చూపుతూ మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ఒప్పుకుంటారా? అంటూ సందేహమనే చెప్పాలి. కానీ ఇది మాత్రం నమ్మలేదని నిజం.

    తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ కొత్త ఒరవడిని తీసుకస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కుటుంబ, వారసత్వానికి దూరంగా ఉన్న పార్టీలో తమ వారసులకు సీట్లు కేటాయించాలని సాక్షాత్తు సీనియర్ నాయకులే కోరుతుండడంతో అధిష్టానానికి మింగుడు పడడం లేదు. వారసులను పార్టీలోకి తీసుకచ్చేందుకు సీనియర్ నాయకులు స్కెచ్ వేస్తుంటే అధిష్టానం వాటికి చెక్ పెడుతూ వస్తుంది. నాయకుడు జితేందర్ రెడ్డి తన తనయుడు మిథున్ రెడ్డి కోసం మహబూబ్ నగర్ టికెట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే జితేందర్ రెడ్డి షాద్ నగర్ లో పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరదు అనడంతో షాద్ నగర్ ను తన కొడుకుకు ఇవ్వాలని అనుకుంటున్నాడు జితేందర్ రెడ్డి.

    ఇక బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ తన కూతురు కోసం గద్వాలను అడుగుతోందని సమాచారం. డీకే అరుణ ఈ సారి నారాయణపేట నుంచి బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నారాయణ పేటను తన కూతురి కోసం బండారు దత్తాత్రేయ కోరినట్లు తెలుస్తుంది. ఇక వేములవాడ టికెట్ ను వికాస్ రావుకు ఇవ్వాలని విద్యాసాగర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్ చార్జి సునీల్ బన్సల్ తో భేటీ కూడా అయ్యారు.

    వరుసగా సీనియర్ల నుంచి వస్తున్న వినతుల మేరకు హై కమాండ్ వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్తున్నట్లు సమాచారం. పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రత్యర్థి పార్టీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దని చూస్తున్నట్లు సమాచారం. వారసత్వ, కుటుంబ పాలనకు బీజేపీ దూరంగా ఉంటుందని చెప్తూనే మొన్న తెలంగాణ సభలో మోడీ కూడా కేసీఆర్ కేటీఆర్ గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ సీఎం అయ్యేందుకు తాను ఒప్పుకోలేదన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని అధిష్టానం ససేమీరా అంటుుంది. నేతలు ఏం చేస్తారో చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం...